పాన్ ఇండియా అంటే ఎస్ఎస్ఆర్-ప్రభాస్

మౌత్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు అంతో ఇంతో కనిపించేది ప్రభాస్ కు మాత్రమే. ఈ స్థాయి అందుకోవాలంటే పుష్ప నడిచినట్లుగానే దేవర కూడా నడవాలి.

పాన్ ఇండియా, దాదాపు రెండు మూడేళ్లుగా టాలీవుడ్ లో చలామణీలో వున్న పదం. టాప్ హీరో ల దగ్గర నుంచి టైర్ త్రీ హీరోల వరకు ఇదే జ‌పం. మిడ్ రేంజ్ హీరోలు నార్త్ ఇండియా వెళ్లి ప్రచారం చేయడం. సినిమాను పాన్ ఇండియా అంటూ స్టార్ట్ చేయడం. కానీ మినిమమ్ కంటెంట్ కూడా అదర్ లాంగ్వేజెస్ లో విడుదల చేయకపోవడం, దగ్గరకు వచ్చాక కేవలం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల చేసి ఊరుకోవడం, చివరకు పాన్ ఇండియా అన్నదే మరిచిపోవడం. చాలా సినిమాల పరిస్థితి ఇదే. కొన్ని మిడ్ రేంజ్ హీరోల సినిమాలు నార్త్ బెల్ట్ లో ప్రచారం వరకు వెళ్తున్నాయి. అంతకు మించి ఏదీ సాధించడం లేదు.

పాన్ ఇండియా అన్నది పదం చిన్నది. కానీ ప్లానింగ్ చాలా పెద్దది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో సినిమా విడుదల చేయాలంటే చాలా ఖర్చు వుంటుంది. పైగా అక్కడ ఎవరూ సినిమాలు కొనరు. కావాలంటే ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తారు. తరువాత ఖర్చులు కలిపి ముక్కు పిండి వసూలు చేస్తారు.

ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలై వసూళ్లు సాధించినవి బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, పుష్ప, సాహో, సలార్, హనుమాన్, కార్తికేయ 2.. వగైరా. వీటిలో హనుమాన్, కార్తికేయ 2, పుష్ప సినిమాలు విడుదల తరువాత హిట్ అలా మెల్లగా మౌత్ టాక్ తో హిట్ అయినవే. అలా కాకుండా ఓపెనింగ్ కనిపించాలంటే రాజ‌మౌళి పేరు అన్నా వుండాలి, ప్రభాస్ హీరోగా అయినా వుండాలి. ప్రస్తుతానికి నార్త్ బెల్ట్ లో మన మార్కెట్ అలాగే వుంది.

ఈ రాత్రికి విడుదలవుతున్న దేవరలో హిందీ నటులు వున్నారు. హిందీ నాట ట్రయిలర్ విడుదల చేసారు. హిందీ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. అన్ని చేసినా హిందీ లో ఓపెనింగ్ లేదు. సినిమా విడుదల తరువాత మౌత్ టాక్ వుంటే వుంటుంది. లేదంటే లేదు.

పుష్ప తో మార్కెట్ తెచ్చుకున్నారు బన్నీ. ఇప్పుడు దేవర మౌత్ టాక్ బాగుంటే ఎన్టీఅర్ కూడా అలాగే తెచ్చుకుంటారు. ఇదే సూత్రం గేమ్ ఛేంజ‌ర్ కు కూడా వర్తిస్తుంది.

మౌత్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల అంతో ఇంతో కనిపించేది ప్రభాస్ కు మాత్రమే. ఈ స్థాయి అందుకోవాలంటే పుష్ప నడిచినట్లుగానే దేవర కూడా నడవాలి. తరువాత ఎన్టీఅర్, ప్రభాస్ లకు కూడా ఓ ఓపెనింగ్ మార్కెట్ అనేది వస్తుంది. లేదంటే లేదు.

17 Replies to “పాన్ ఇండియా అంటే ఎస్ఎస్ఆర్-ప్రభాస్”

  1. పుష్ప తో మార్కెట్ తెచున్నారు బన్నీ…. కాదు… పుష్పతో బన్నీ కి మార్కెట్ ఇచ్చాడు సుకుమార్. పుష్ప తర్వాత కూడా బన్నీ మూవీస్ కి మార్కెట్ ఉంటే అది బన్నీ మార్కెట్ అవుతుంది.

  2. Pulka, do you know how many shows are being aired on Day 1? They’re airing 6 shows in Mumbai, just like in Hyderabad.

    You don’t need any superpowers—just open the ticket booking apps and browse for major cities in North India, Maharashtra, Haryana…

    Pulka writer, Pulka article.

    If you have the guts, comment back here…

  3. Pulka, do you know how many shows are being aired on Day 1? They’re airing 6 shows in Mumbai, just like in Hyderabad.

    You don’t need any superpowers—just open the ticket booking apps and browse for major cities in North India, Maharashtra, Haryana…

    Pulka writer, Pulka article.

    If you have the guts, comment back here…

Comments are closed.