లూలూకు ఇచ్చింది ఎక్కువ పెట్టుబడి తక్కువ

విశాఖలో మరోమారు లూలూ గ్రూప్ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు లులు గ్రూప్ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ కలసినపుడు ఖరారు అయింది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నపుడు…

విశాఖలో మరోమారు లూలూ గ్రూప్ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు లులు గ్రూప్ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ కలసినపుడు ఖరారు అయింది. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నపుడు లూలూ విశాఖలో గతంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చింది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లూలూ గ్రూపు వెనక్కి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటి అంటే లూలూకి ఇచ్చిన భూము వేయి కోట్లు అయితే ఆ గ్రూపు పెట్టుబడులుగా పెట్టింది కేవలం ఆరు వందల కోట్ల రూపాయలే.

అందుకే లూలూ గ్రూప్ విషయంలో వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేసింది అని అప్పట్లో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాధ్ చెప్పారు. ఏ పరిశ్రమ అయినా వస్తే స్థానికంగా ప్రయోజనం ఉండాలని ఆయన అన్నారు. అంతే తప్ప ప్రభుత్వం ఎక్కువ ఇచ్చి తక్కువ పెట్టుబడులతో పరిశ్రమను రప్పిస్తే ఎలా అని ప్రశ్నించారు.

విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదు అయిన భూమిని నాటి టీడీపీ ప్రభుత్వం లూలూ గ్రూపు కి కట్టబెట్టిందని ఆయన విమర్శించారు. దాని మీద తాము ప్రతిపక్షంలో ఉన్నపుడే పోరాటం చేశామని ఆయన చెప్పారు. లులుకు కేటాయించిన భూమిపై తమ ప్రభుత్వం ఆనాడు అన్నీ స్వయంగా పరిశీలించింది అని ఆయన చెప్పారు.

విశాఖ బీచ్ ఎదురుగా 13.5 ఎకరాల భూమి లూలూకి చంద్రబాబు గతంలో కట్టబెట్టారు అని గుడివాడ ఆరోపించారు. అక్కడ ఎకరం విలువ వంద కోట్లు ఉంటుందని ఆ విధంగా చూసే 1350 కోట్ల రూపాయలు లూలూకి ప్రభుత్వమే ఇచ్చినట్లు అయింది అని అన్నారు. ఇంతా చేసి లూలూ పెట్టేది ఆరు వందల కోట్లే అని ఆయన లెక్క తేల్చారు.

ఒక సంస్థ పెట్టుబడులు పెడితే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలు సిటీకి హార్ట్ గా ఉన్న ప్రదేశాలు ఇచ్చేస్తే ఎలా అని ఆయన నిలదీశారు. విశాఖలో లూలూకి ఈసారి అయినా అభివృద్ధి పెద్దగా చెందని ప్రాంతాలలో భూమి కేటాయించాలని ఆయన సూచించారు.

విశాఖ శివారులో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని అక్కడ లూలూకి కేటాయిస్తే చుట్టు పక్కన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అయితే లూలూకి గతంలో కేటాయించిన చోటనే ప్రభుత్వం మళ్లీ భూమి ఇస్తుందని అంటున్నారు. అదే జరిగితే లూలూ పంట పండినట్లే అని అంటున్నారు.

13 Replies to “లూలూకు ఇచ్చింది ఎక్కువ పెట్టుబడి తక్కువ”

    1. మరి 650 కోట్ల కొసం 1350 కోట్లు ఇస్తారా? ఇది ప్రభుత్వ భూములు బలిసినొల్లకి ధారాదతం చేయడం కాదా?

  1. Interesting, something is not adding up. Babu’s vision document limits Govt subsidy to 30% max on non-conventional energy and 20% on other developmental projects, then how come Lulu has 225% subsidy as Amarnath claims?

  2. ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు.. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కొ ఇస్తే నాలుగు ఉద్యోగాలు కల్పిస్తారు…

    1. How a colony grows..There will be no building at starting stage.. so one guy will start a small house in the colony.. He will put his efforts in the start.. after some days the other plot member will get gut feeling and he will also start construction. like that after some months/ years some 10 houses will come. slowly one of the house owner starts one small shop for the daily necessities (milk, eggs. veggies). once one shop is there.. house construction will go rapidly on that colony.. more shops big shops will come and colony becomes crowdy………….. So this LuLu is the kind of starting point. Things will take time.. but should start some where.. This is civilization

      1. That is actually the Walmart model.. that is how rural American towns develop when a Walmart comes to the area.. but this case is entirely different.. they are setting them up right in the heart of big cities like Hyd.. Vizag.. Bangalore.. nothing new would accrue…

  3. అసలు ఏమి పెట్టకుండా కాకినాడ సెజ్ లాగా నాటకం ఆడేసి వైస్సార్ లాగా కొట్టేస్తే బాగుంటుంది

Comments are closed.