పాత పెన్షన్ విధానం ఎప్పుడు బాబూ?

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నాలుగు నెలలు అవుతోంది. గతంలో ఇచ్చిన హామీలు తమకు దక్కాల్సిన వాటి గురించి వివిధ సంఘాలు మెల్లగా కోరుతున్నాయి. కూటమి సర్కార్ కి హానీమూన్ పీరియడ్ పూర్తి…

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నాలుగు నెలలు అవుతోంది. గతంలో ఇచ్చిన హామీలు తమకు దక్కాల్సిన వాటి గురించి వివిధ సంఘాలు మెల్లగా కోరుతున్నాయి. కూటమి సర్కార్ కి హానీమూన్ పీరియడ్ పూర్తి అయింది అన్న సంకేతాలను కూడా వినిపిస్తున్నాయి.

ఉద్యోగ వర్గాలు అయితే గొంతు విప్పుతున్నాయి. సీపీఎస్ రద్దు మీద ఇప్పటికీ గట్టిగా నిలబడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇతర వర్గాలు అన్నీ కూడా తమకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాయి.

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసాకోసం పాత పెన్షన్‌ అమలు చేసే కచ్చితమైన తేదీని ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.శ్రీనివాస్‌ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్‌ పథకాన్ని సమీక్షించి మెరుగైన పింఛన్‌ విధానాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.

అందువల్ల తమకు గ్యారంటీ పెన్షన్ విధానం వద్దని ఆయన అంటున్నారు. గతంలో మాదిరిగానే పాత పెన్షన్ నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు అన్నీ ఇపుడు ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ తీసుకుని వచ్చిన జీపీఎస్ అనబడే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా లేదు. అలాగే సీపీఎస్ అంటే ఉద్యోగులు ఒప్పుకోరు.

ఈ రెండూ కాకుండా వేరే మార్గాన్ని కూటమి ప్రభుత్వం అన్వేషిస్తుందా లేక పాత పెన్షన్ విధానం అమలు చేస్తుందా అన్నది ఉద్యోగ వర్గాలలో తర్కించుకుంటున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీం అంటే ఏపీ ఆర్ధికంగా ఏ మాత్రం భరించలేదు. కానీ ఉద్యోగులు అంతా దానినే కోరుతున్నారు.

9 Replies to “పాత పెన్షన్ విధానం ఎప్పుడు బాబూ?”

Comments are closed.