ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!

ఒక వ్యక్తి గొప్పోడని చెప్పాలంటే లేదా మంచోడని చెప్పాలంటే అతనితో సమాన స్థాయి ఉన్న మరో వ్యక్తితో కంపేర్ చేయాలి. మామూలుగా కూడా గొప్పోడని చెప్పొచ్చు. కానీ ఇంకో వ్యక్తిని తిట్టాలంటే నేరుగా తిట్టలేక…

ఒక వ్యక్తి గొప్పోడని చెప్పాలంటే లేదా మంచోడని చెప్పాలంటే అతనితో సమాన స్థాయి ఉన్న మరో వ్యక్తితో కంపేర్ చేయాలి. మామూలుగా కూడా గొప్పోడని చెప్పొచ్చు. కానీ ఇంకో వ్యక్తిని తిట్టాలంటే నేరుగా తిట్టలేక ఇలా కంపేర్ చేస్తుంటారు. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే ఆటోమేటిగ్గా రెండో భార్య చెడ్డదన్నట్లే లెక్క.

కేటీఆర్ అలాగే వ్యవహరిస్తున్నాడు. ఆయన ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును యమ పొగుడుతున్నాడు. రేవంత్ ను తిట్టాలంటే బాబును పొగడాలి. ఇద్దరూ సీఎంలే కదా. అక్కడ ఆయనేం చేస్తున్నాడు, ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు ప్రజలకు తెలియాలి కదా. ఇద్దరినీ కంపేర్ చేస్తూ మాట్లాడితే ప్రజలకు సులభంగా అర్ధమవుతుంది.

పెన్షన్లపై చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కేటీఆర్ అన్నాడు. ఈ మాట చాలాసార్లు చెప్పిన కేటీఆర్ తాజాగా మరోసారి చెప్పాడు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచారని అన్నాడు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డాడు.

హైడ్రాను తీవ్రంగా నిరసిస్తున్న కేటీఆర్ దీనిపై సుప్రీం కోర్టుకు వెళతామన్నాడు. మూసీ సుందరీకరణ అనేది పెద్ద కుంభకోణమని ఆరోపించాడు. కానీ ఇదే కేటీఆర్, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ సుందరరీకరణ చేస్తామని పదే పదే చెప్పేవారు. కానీ ప్రతిపక్షంలోకి రాగానే మూసీ సుందరీకరణ కుంభకోణమని అంటున్నాడు.

ఒకే అంశంపై రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా , అపోజిషన్ లో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తుంటారు. కేటీఆర్ ఇప్పుడు మూసీ సుందరీకరణ మంచిదే అనే చెప్పలేడు. అలా అంటే రాజకీయంగా నష్టం కలుగుతుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టకపోతే రాజకీయ మనుగడ కష్టం.

5 Replies to “ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!”

  1. మళ్ళా ప్రతిపక్షంలో కూర్చోడానికి రెడీ చేస్తున్నాడు పార్టీ ను

Comments are closed.