జీవితంలో క్షమించేది లేదు – అఖిల్

లేటుగానైనా ఘాటుగా స్పందించాడు అక్కినేని అఖిల్. కొండా సురేఖపై అతడు తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తన విలువల్ని, ప్రజా సంక్షేమాన్ని వదిలేయడానికే కొండా సురేఖ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందన్నాడు. Advertisement “ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు,…

లేటుగానైనా ఘాటుగా స్పందించాడు అక్కినేని అఖిల్. కొండా సురేఖపై అతడు తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తన విలువల్ని, ప్రజా సంక్షేమాన్ని వదిలేయడానికే కొండా సురేఖ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందన్నాడు.

“ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వల్ల గౌరవనీయమైన, నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారు. నలుగురిలో అగౌరవానికి గురయ్యారు. ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో, తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేశారు. తన రాజకీయాల కోసం వాళ్లను బలిపశువులను చేశారు.”

అక్కినేని కుటుంబ సభ్యుడిగా, సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిగా ఈ విషయంలో తను మౌనంగా ఉండలేనని స్పష్టం చేసిన అఖిల్.. సమాజంలో కొండా సురేఖకు స్థానం లేదన్నాడు. ఆమెను సహించేది లేదని, క్షమించేది లేదని ప్రకటించాడు.

కొండా సురేఖపై ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు నిరసన తెలియజేశారు. చిరంజీవి, వెంకటేశ్, మహేష్ నుంచి మొదలుపెడితే హీరోలంతా స్పందించారు. ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. నాగార్జున, సమంత, నాగచైతన్యపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు సురేఖ. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

18 Replies to “జీవితంలో క్షమించేది లేదు – అఖిల్”

  1. అమె చాలా సినియర్ లీడర్

    ఇటువంటి త్రివరమైన వ్యాఖ్యలు చెసిందంటె..పొట్టొడి పర్మిషన్ లెకుండా చెయ్యదు అనుకుంటా

    వాడికి అర్థం కావట్లెదు

    పదవిలొ వున్నప్పుడు విపరీతంగా గర్వం ప్రదర్శించినొడు తర్వాత ఇంటెకె పర్మితం కావాలి

    ముక్కొడి పరిస్తితి..సైకొ గాడి పరిస్తితి చూసి అయినా బుద్ది తెచ్చుకొ

      1. మీరు నమ్మినా నమ్మకపొయినా ..రెండు తెలుగు రాష్ట్రాల్లొ పవన్ ను మించి గర్విష్టి లెడు ..

        మీరు నమ్మక పొవచ్చు ..ఇది నిజం

      2. టీడీపీ-జనసేన మధ్య లుకలుకలు మొదలయ్యాయి అనడానికి పైన కామెంటే ఒక ఉదాహరణ. ఇద్దరూ తన్నుకుని సై..కో..ని మరోసారి గద్దెనెక్కిస్తారని భయంగా ఉంది

        1. అతను అసలు ఏ పార్టీకి చెందినవాడు కాదు అని నా ఒపీనియన్. చంద్ర బాబును కూడా చాలా సార్లు విమర్శించాడు.

  2. కొండా సురేఖ హైద్రాబాద్ లొ శ్రీ చైతన్య, నారాయణ హాస్టల్స్ లొ ఆడపిల్లల బాధలు గత రెండు వారాలుగా వార్తలు వస్తున్నాయి. ఆడపిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యి 105 మంది ఇబ్బంది పడి ఒక అమ్మాయి చనిపోతే నీకు కళ్ళకు కనిపించలేదు.

    హైడ్రా పేదల ఇల్లు కులగొట్టి రోడ్ మీద వాళ్ళ ఏడుపులు నీకు కనబడలేదు. రాష్టం లొ జనాల సమస్యల గురించి ఈరోజన్నా మాట్లాడవా

    ఇప్పుడు అనవసరం గా రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని కెలికావు. ని గొయ్యి నువ్వు తీసుకుంటే ఎవరేమి చేస్తారు.

  3. She is a worthless woman. Just because the kr00k Yesr gave her some Minister position, she resigned for crmnl jag, both of becuase of innocence of being BC and greed. Now to be in good books of fraudster Revanth, she went to extreme levels and to preserve her position. What a transformation from being a Naxalite to prosti politician, a perfect symbol how humans can become selfish

  4. వయసులో చిన్న వాడైనా మా అఖిల్ బాబు కొండాకు బాగా ఎండు గడ్డి పెట్టాడు. జై అక్కినేని ఫ్యామిలీ.

  5. అంటే ఇపుడు 100కోట్లు ఇస్తే పరువు వెనక్కి వస్తుందా..?? ఇది పరువు నష్టమా..?? లేక N-Convention నష్ట పరిహారమా..??

Comments are closed.