బలగం సక్సెస్ లో సునీతకు షేర్

అద్భుతమైన ఎమోషన్స్ తో సూపర్ డూపర్ హిట్టయింది బలగం సినిమా. లెక్కలేనన్ని అవార్డులు అందుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ కు తిరుగులేని గౌరవం/గుర్తింపు తెచ్చిపెట్టింది. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు.. ఇలా…

అద్భుతమైన ఎమోషన్స్ తో సూపర్ డూపర్ హిట్టయింది బలగం సినిమా. లెక్కలేనన్ని అవార్డులు అందుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ కు తిరుగులేని గౌరవం/గుర్తింపు తెచ్చిపెట్టింది. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు.. ఇలా బలగం సక్సెస్ క్రెడిట్ ను అందరూ అందుకున్నారు.

అయితే సినిమాతో అస్సలు సంబంధం లేని సింగర్ సునీతకు కూడా బలగం సక్సెస్ క్రెడిట్ దక్కింది. స్వయంగా నిర్మాత దిల్ రాజు, ఆమెకు ఈ క్రెడిట్ ఇచ్చాడు.

బలగం సినిమాను విడుదలకు ముందు రామ్-సునీత కలిసి ఎడిట్ సూట్ లో చూశారు. సెకండాప్ లో కీలకమైన ఎపిసోడ్ కు కొన్ని సూచనలు చేశారట సునీత. ఆవిడ చెప్పిన మీదట సెకండాఫ్ లో బ్లాక్ ను ఇంకొంచెం టైట్ చేశారట. అది సినిమాకు చాలా ప్లస్ అయిందంటున్నాడు దిల్ రాజు.

బలగం సినిమా పూర్తిగా తెలంగాణకు పరిమితమైపోయిందంటూ విడుదలకు ముందు నుంచే విమర్శలు వచ్చాయంట. సునీత సినిమా చూసిన తర్వాత ఇది తెలంగాణ చిత్రం కాదని, తెలుగువాడి సినిమా అని, అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని అన్నారట.

అప్పుడు ఆవిడ ఇచ్చిన నమ్మకంతో ముందుకెళ్లామని, థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత అదే నిజమైందన్నారు దిల్ రాజు. అందుకే బలగం సినిమా సక్సెస్ లో సునీతకు కూడా కొంత క్రెడిట్ ఇస్తున్నట్టు తెలిపాడు.

3 Replies to “బలగం సక్సెస్ లో సునీతకు షేర్”

Comments are closed.