నేను చెబుతున్నాను.. మీకు నవ్వాగదు

విశ్వం సినిమా థియేటర్లలో ప్రేక్షకుడికి నవ్వు ఆగదంటున్నాడు హీరో గోపీచంద్. ప్రతి కామెడీ బ్లాక్ అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమాతో శ్రీనువైట్ల బౌన్స్ బ్యాక్ అవుతారని అంటున్నాడు. Advertisement “థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్క…

విశ్వం సినిమా థియేటర్లలో ప్రేక్షకుడికి నవ్వు ఆగదంటున్నాడు హీరో గోపీచంద్. ప్రతి కామెడీ బ్లాక్ అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమాతో శ్రీనువైట్ల బౌన్స్ బ్యాక్ అవుతారని అంటున్నాడు.

“థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నవ్వాగదు. నేను చెబుతున్నాను ఇది. యాక్షన్, కామెడీ అద్భుతంగా వచ్చింది. ప్రతి బ్లాక్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్.”

హీరోల్ని కంఫర్ట్ గా ఉంచడంలో శ్రీనువైట్ల తర్వాతే ఎవరైనా అంటున్నాడు గోపీచంద్. తను ఎన్నో సినిమాలు చేశానని, కానీ వైట్ల ఇచ్చిన కంఫర్ట్ ఎక్కడా చూడలేదన్నాడు.

ఓ సీన్ చేసేటప్పుడు ఎలా చేయాలో శ్రీనువైట్ల చేసి చూపిస్తాడట. ఆయన చేసినప్పుడు చాలాసార్లు నవ్వుకున్నానని, ఆ కామెడీ సీన్లను ఆయనతో పదే పదే చేయించుకున్నానని అన్నాడు గోపీచంద్. ఇక తను చేసేటప్పుడు నవ్వు ఆపుకోలేక, ఒక్కో సీన్ కు 10 టేకులు తీసుకున్నానని అన్నాడు.

ఇలా విశ్వం సినిమాను పూర్తిస్థాయిలో నవ్వించే కామెడీ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు గోపీచంద్. 11న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

15 Replies to “నేను చెబుతున్నాను.. మీకు నవ్వాగదు”

  1. ఈ మూవీ ఫ్లాప్ అయ్యాక, నాకు ముందే తెలుసు పోతుందని అని చెప్తాడు తర్వాత ఆస్ యూజువల్ గా. ప్రతి సినిమాకు ఇదే టెంప్లేట్ వాడతాడు ఈ హీరో

    1. మీ హీరో ప్లాప్ లు చూసుకో ముందు,,, మా అన్న జోలీ ఎందుకు బయ్యా,,,, alwayes గోపీచంద్ మాస్ కా బాప్,,,, నీలాంటి యాంటీస్ em……..,,,,,,,,, ru

  2. మీ హీరో పేరు చెప్పు,,,, 100మాటలు చెప్తా,,, సొల్లు గాళ్ళు వచ్చారయ్య మా అన్న మీద కామెంట్ చేసేముందు మీ హీరో ముడ్డి చుస్కో,,, jaii macho స్టార్

Comments are closed.