దొంగ సొత్తు తిరిగిస్తే నేరం మాసిపోతుందా?

ఓ ఘరానా దొంగ ఒక ఇంటికి కన్నం వేసి భారీగా దోచుకున్నాడు. రెండు మూడు రోజుల తర్వాత పోలీసులు ఆ ఊళ్లో దొంగతనాల గురించి పోలీసులు గట్టిగానే ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారు. పరిస్థితులు చూస్తే…

ఓ ఘరానా దొంగ ఒక ఇంటికి కన్నం వేసి భారీగా దోచుకున్నాడు. రెండు మూడు రోజుల తర్వాత పోలీసులు ఆ ఊళ్లో దొంగతనాల గురించి పోలీసులు గట్టిగానే ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారు. పరిస్థితులు చూస్తే తాను కన్నం వేసి దొంగిలించిన సంగతి కూడా దొరికిపోయే అవకాశం ఉందని దొంగకు అనిపించింది. పోలీసులు విచారణ పూర్తి చేయకముందే, ఆ దొంగ తాను చోరీ చేసిన సొత్తునంతా తీసుకువచ్చి తిరిగి ఇచ్చేసాడు. ఈ పని చేసినంత మాత్రాన చోరీల మీద వేసిన ఎంక్వయిరీ ఆపేయాలా? దొంగిలించిన సొత్తు తిరిగిచ్చినంత మాత్రాన దొంగ పరిశుద్ధుడైపోతాడా? ఇక పెద్దమనిషిగా చెలామణీ అయిపోవచ్చునా అనే సందేహాలు ఈ కథ వింటే మనకు కలుగుతాయి!

అచ్చంగా ఇదే సందేహాలు ఇప్పుడు కన్నడ ప్రాంత రాజకీయాలను గమనిస్తున్న వారికి కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమిని అడ్డదారిలో సొంతం చేసుకున్న సంస్థ సిద్ధార్థ విహార ట్రస్ట్, ఇప్పుడు ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పేసింది.

మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) చేసిన కార్యకలాపాలు, భూ కేటాయింపులు తదితర వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ పై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. ఈ సమయంలో ఈ సిద్ధార్థ విహార ట్రస్టు తమకు కేటాయించిన భూమిని తిరిగి ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు వారు భూమిని తిరిగి ఇచ్చేశారు గనుక వారు ఏ నేరమూ చేయనట్లేనా? వారు పరిశుద్ధులు అయిపోయినట్లేనా? వారిని నిందించే పనిలేదని అనుకోవాలా? అనేది ప్రజల ముందు ఉన్న ప్రశ్న!

సదరు సిద్ధార్థ విహార్ ట్రస్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందినది కాకపోయి ఉంటే ఈ చర్చ జరిగేది కాదు. ఖర్గే ఆయన కుమారుడు రాహుల్ ఖర్గే, అల్లుడు రాధాకృష్ణ అందులో ట్రస్టీలు కాకపోయి ఉంటే కూడా ఈ చర్చ నడిచేది కాదు.

ఇప్పుడు తాము చేసిన నేరం బయటపడుతుందనే భయంతో స్థలాన్ని తిరిగి ఇచ్చేశారని, అంత మాత్రం చేత వారిని ఉపేక్షించరాదని ముడాస్కామ్ విచారణ పూర్తిగా సాగించి అందులో పాత్రధారులు, సూత్రధారులు అందరినీ కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే సారధ్యంలో ఈ ట్రస్టు నడుస్తుంది. రొటీన్ ప్రాసెస్ లో భాగంగా ఆ ట్రస్టు భూమికోసం దరఖాస్తు చేసుకుందని అర్హతలు సీనియారిటీ ఉన్నందువలన వారికి కేటాయింపు జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

కానీ ఈ కేటాయింపులోనే తప్పు జరిగిందని ఏకంగా గవర్నరుకు ఫిర్యాదు వెళ్లింది. అందుచేతనే ఖర్గే కుటుంబం అత్యంత విలువైన ఐదు ఎకరాల భూమిని తిరిగి అప్పగించేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూమి పొందడం ద్వారా తమకు అంటిన బురదలను కడిగేసుకోవడానికి ఖర్గే కుటుంబం భూమిని తిరిగి ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇంకా ఏం చేస్తుందో వేచి చూడాలి!!

16 Replies to “దొంగ సొత్తు తిరిగిస్తే నేరం మాసిపోతుందా?”

  1. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి.

    అప్పట్లో దొం*గ ప్యాలస్ పులకేశి ఫ్యామిలీ కూడా వేల కొద్దీ ఎకరాలు ఇలానే కాజే*సి, తూచ్ ఆ పొలాలు ప్రభుత్వం వి అని మాకు తెలీదు, అక్కడ కనిపిస్తే , మావే అని వాడికున్నం ఇన్ని ఏళ్ళు

    అని దొం*గతనం బయట పడ్డాక తిరిగి ఇచ్చినట్లు కదా.

    1. పందు లు కాసుకున్ని అప్పట్లో ఇండియా మీద దాష్టీకం చేసే బ్రిటిష్ వాళ్ళ తొత్తూ గా వుండి, వాళ్ళకి మన రహస్యాలు అమ్ముతూ పంది మాసం, గొడ్డూ మాసం అమ్ముకునే రాజన్న ( అప్పట్లో రెడ్డి తోక లేదు) నుండి అదే దొం*గ తనం అలవాటు, ప్రజల ఆస్తులు దోచుకోడం.

  2. గుర్తు చేసి మరీ తన్నించుకోడం ఇదే.

    ఈ న్యూస్ చూడగానే ప్రజలకి చప్పున గుర్తుకువచ్చేది, అప్పట్లో ప్యాలస్ పులకేశి ఇడుపులపాయ లో దళితులకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు కా*జేసి, బయటపడ్డక తిరిగి ఇచ్చిన విషయము.

  3. అదేంటి GA, వ్రత భంగం చేసుకున్నావు, కాంగ్రెస్ కి ప్రత్యేకించి తెలంగాణా, కర్ణాటక కాంగ్రెస్ లకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ వెయ్యకూడదు కదా, ఎప్పుడూ అక్కడి బీజేపీ ని అపహాస్యం చేస్తూ వెయ్యాలి కదా!

  4. మహా మేత గాడు ఇడుపులపాయ లో మేసిన వేల ఎకరాలు , ఇప్పుడు వాడి శుంఠ రత్నం జగన్ రెడ్డి మేసిన , మేస్తున్న మైనింగ్ భూముల సంగతి ఏమిటి ?

Comments are closed.