నాని సరసన శ్రద్ధా కపూర్?

హీరో నాని తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. కథ ఓకె చేయడం దగ్గర నుంచి దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వరకు.. చేసి వదిలేయరు. జ‌స్ట్ ఫైనల్ చెక్ మాత్రమే తనది అనుకోరు.…

హీరో నాని తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. కథ ఓకె చేయడం దగ్గర నుంచి దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వరకు.. చేసి వదిలేయరు. జ‌స్ట్ ఫైనల్ చెక్ మాత్రమే తనది అనుకోరు. ప్రతి విషయంలోనూ ఒకటికి పదిసార్లు లెక్కలు వేసుకుంటారు. దసరా సినిమా తరువాత అదే బ్యానర్, అదే నిర్మాతకు ఓ సినిమా చేస్తున్నారు. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ రూటెడ్ స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ పని మొదలైంది.

ఈ సినిమాలో పాత్ర ప్రకారం అయితే మంచి నోటెడ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కావాలి. లేదా ఫ్రెష్ ఫేస్ కావాలి. ఇప్పుడు ఇదే పని మీద వున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ మెయిన్ ఛాయిస్ గా వుంది. నాని పట్టువదలని విక్రమార్కుడిలా పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ హిందీ మార్కెట్ అంత‌సులువుగా చిక్కడం లేదు. శనివారం నాది సినిమాతో ట్రయ్ చేసారు కానీ కుదరలేదు. తమిళ, మలయాళ మార్కెట్ కొంత వరకు బెటర్.

అందుకే గతంలో మృణాళ్ తో హాయ్ నాన్న చేసినట్లే శ్రద్ధ కపూర్ తో ఈ సినిమా చేస్తే ఎట్ లీస్ట్ నాన్ థియేటర్ మార్కెట్ అయినా బాగుంటుంది అనే థాట్ వుంది. కానీ అమె డేట్ లు, రెమ్యూనిరేషన్ ఇవన్నీ చూసుకోవాలి.

ఇదిలావుంటే సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా టైమ్ నే సమస్య. అనిరుధ్ తో అంత చకచకా పని జ‌రగదు. అనిరుధ్ దగ్గర కమిట్ మెంట్ తీసుకుని ముందుకు వెళ్లాలా? లేదా దేవీశ్రీతో ఓ సినిమా చేయాలా అన్న డిస్కషన్లు సాగుతున్నాయి.

6 Replies to “నాని సరసన శ్రద్ధా కపూర్?”

Comments are closed.