శరీరం మాట వినకుండా తప్పు చేశాను

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్ లో ఎక్కువగా వర్కవుట్స్ చేసే ఈ బ్యూటీ.. నడుముకు బెల్ట్ కట్టుకోకుండా, 80 కిలోల బరువు ఎత్తే ప్రయత్నం చేసింది. Advertisement…

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్ లో ఎక్కువగా వర్కవుట్స్ చేసే ఈ బ్యూటీ.. నడుముకు బెల్ట్ కట్టుకోకుండా, 80 కిలోల బరువు ఎత్తే ప్రయత్నం చేసింది.

ఆ టైమ్ లో ఆమె అది సాధించింది. కానీ ఆ తర్వాత తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడింది. దీంతో గడిచిన 6 రోజులుగా ఆమె మంచం నుంచి కిందకు దిగలేని పరిస్థితికి వచ్చింది.

ఈ విషయాన్ని రకుల్ స్వయంగా బయటపెట్టింది. 6 రోజులుగా మంచంపైనే ఉంటున్నానని, ఒక్కోసారి మరీ మూర్ఖంగా ఉండకూడదని, శరీరం చెప్పిన మాట కూడా వినాలని అంటోంది.

“నేను చాలా తెలివితక్కువ పని చేశాను. నా శరీరం చెప్పిన మాట వినలేదు. గత 6 రోజులుగా మంచం మీద ఉన్నాను. నేను పూర్తిగా కోలుకోవడానికి మరో వారం పడుతుందంటున్నారు. అంతకంటే వేగంగా కోలుకుంటానని ఆశిస్తున్నాను, కానీ, ఇది నేర్చుకున్న పాఠం. దయచేసి మీ శరీరం మీకు సంకేతాలను ఇచ్చినప్పుడు వినండి.”

ఇలా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది రకుల్. తన బాడీ కంటే మైండ్ బలమైందని ఇన్నాళ్లూ అనుకున్నానని, కానీ అది ప్రతిసారి నిజం కాదని అంటోంది. త్వరలోనే మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేస్తానంటూ నవ్వుతూ వీడియో పోస్ట్ చేసింది.

9 Replies to “శరీరం మాట వినకుండా తప్పు చేశాను”

  1. fitness ki eevida exercises ki emanna sambandham vunda? repu olympics lo gold medal kemanna plan chesinda endi. yoga chesina fit vundochchu. 80 kg weights naalugu gantalu gymming chesthene fitness kaadu.

  2. fitness ki eevida exercises ki emanna sambandham vunda? repu olympics lo gold medal emanna plan chesinda. ara ganta yoga chesina fit vundochchu. 80 kg weights naalugu gantalu gymming chesthene fitness kaadu.

  3. fitness ki eevida exercises ki emanna sambandham vunda? repu olympics lo gold medal emanna plan chesinda. ara ganta yoga chesina fit vundochchu. 80 kg weights 4 hours gym chesthene fitness kaadu.

  4. Is there any link between fitness and lifting 80 kg weights. Is she planning to win some olympic medal for india or what? Public listen to this over action news from celebrities and think it takes so much to keep fit. Even doing 1/2 hour yoga will keep anyone fit. These videos from celebrities are pure over action news to sell themselves.

  5. ఇలాంటివి చెబుతూ ఉండాలి, మూర్ఖత్వం తో ఆరోగ్యం, శరీరం నిర్లక్ష్యం చెయ్యకూడదు అని.

Comments are closed.