పుష్ప 2.. టార్గెట్ బాలీవుడ్

పుష్ప 2 విడుదల మరో నెలన్నర దగ్గరకు వచ్చేసింది. ఒక పక్క షూట్ జ‌రుగుతోంది. సుకుమార్ అంటే అలాగే వుంటుంది. రేపు రిలీజ్ అన్నా, ఈ రోజు సాయంత్రం వరకు ఫైన్ ట్యూన్ చేస్తూనే…

పుష్ప 2 విడుదల మరో నెలన్నర దగ్గరకు వచ్చేసింది. ఒక పక్క షూట్ జ‌రుగుతోంది. సుకుమార్ అంటే అలాగే వుంటుంది. రేపు రిలీజ్ అన్నా, ఈ రోజు సాయంత్రం వరకు ఫైన్ ట్యూన్ చేస్తూనే వుంటారు అన్నది ఇండస్ట్రీ మాట.

అ సంగతి అలా వుంచితే బన్నీ స్టయిల్ పాన్ ఇండియా ప్రచారం చేయాలి అంటే కనీసం నెల రోజులు సమయం పడుతుంది. ఇక్కడా.. అక్కడా ఓ చిన్న చిన్న మీట్ లు పెట్టి వదిలేసే రకం కాదు బన్నీ. అందువల్ల నెల రోజులు కచ్చితంగా కావాలి. పైగా రొటీన్ పాటలు వదలడం, కంటెంట్ వదలడం సరిపోదు. అంతకు మించి కావాలి.

ఇప్పుడు అదే ప్లానింగ్ లో వున్నారట బన్నీ. పుష్ప 2 ప్రచారం మొత్తం నార్త్ ఇండియా టార్గెట్ గా సాగుతుందని తెలుస్తోంది. వీలయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి భారీగా ముంబాయిలో చేసే అలోచన కూడా వుందట. దేవర ట్రయిలర్ ను సైతం ముంబాయిలో లాంచ్ చేసారు. తెలుగులో ఈవెంట్ నే చేయలేదు. సక్సెస్ మీట్ కూడా క్లోజ్డ్ డోర్స్ లో చేశారు. అందువల్ల పుష్ప 2 మాత్రం తెలుగుకు పెద్దగా ప్రయారిటీ ఇస్తుందని లేదు.

ఓ ప్రయివేట్ ఈవెంట్ లేదా మీడియా మీట్ మాత్రమే తెలుగు నేల మీద వుంటుంది. మిగిలినవన్నీ కేరాఫ్ నార్త్ ఇండియానే. నేషనల్ లెవెల్ లో క్రేజీ చిట్ చాట్ లు, ఇంటర్వూలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇండియాలోని కీలక పట్టణాలన్నీ బన్నీ టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఓ పెద్ద ఏజెన్సీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇండియా వైడ్ గా ఓ బలమైన రికార్డును క్రియేట్ చేయాలని బన్నీ చూస్తున్నట్లు వుంది గమనిస్తూ వుంటే.

2 Replies to “పుష్ప 2.. టార్గెట్ బాలీవుడ్”

Comments are closed.