డబ్బు కోసం.. డబ్బు చుట్టూ..

సిగరెట్.. డ్రగ్స్.. అల్కహాల్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ .. Advertisement ఇది ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి రెస్పెక్ట్ కావాలంటే అ డబ్బు మన ఒంటి మీద కనిపించాలి.. ఐ…

సిగరెట్.. డ్రగ్స్.. అల్కహాల్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ ..

ఇది ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి రెస్పెక్ట్ కావాలంటే అ డబ్బు మన ఒంటి మీద కనిపించాలి..

ఐ యామ్ నాట్ ఏ చీటర్.. జ‌స్ట్ ఐ యామ్ రిచ్.. ఇలా చాలా మంది డైలాగులతో వచ్చింది లక్కీ భాస్కర్ ట్రయిలర్.

దుల్కర్ సల్మాన్- మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వెంకీ అట్లూరి అందిస్తున్న సినిమా ఇది. సితార సంస్థ నిర్మాణం. స్టాక్ మార్కెట్ లో 90 వ దశకంలో స్టాక్ మార్కెట్ లో జ‌రిగిన స్కామ్ నేపథ్యంలో అల్లుకున్న కథతో తయారవుతోందీ సినిమా.

మధ్య తరగతికి చెందిన ఓ యువకుడు, భార్య, బిడ్డతో హ్యాపీగా బతికేస్తూ, డబ్బు లేని కారణంగా అవమానం ఎదుర్కొని, ఇక ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాలి, ఎంతయినా చేయాలి అని డిసైడ్ అయిన తరువాత ఙరిగిన పరిణామాలు వరుసగా ట్రయిలర్ లో చోటు చేసుకున్నాయి. ట్రయిలర్ ను కట్ చేసిన తీరు బాగుంది. సున్నితమైన సన్నివేళాలతో ప్రారంభించి, థ్రిల్లర్ టచ్ ఇచ్చి, ఎమోషన్ దిశగా నడిపారు ట్రయిలర్ ను.

మధ్య తరగతిని, డబ్బు ప్రభావాన్ని, కామన్ మాన్ డబ్బు గురించి చేసే అలోచనలను, కామెంట్లను అన్నింటిని ఒడిసి పట్టింది ట్రయిలర్. ఎప్పుడయితే థ్రిల్లింగ్ జ‌ర్నీ, ఎమోషనల్ జ‌ర్నీ రెండూ కలగలసి సినిమాలో సాగుతాయో కచ్చితంగా అకట్టుకునే అవకాశం వుంటుంది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

2 Replies to “డబ్బు కోసం.. డబ్బు చుట్టూ..”

  1. హెడ్డింగ్ చూసి షర్మిల -జగన్ – రాధాకృష్ణ సిరీస్ లో భాగం అనుకున్నాను.

Comments are closed.