దీపావళికి నాలుగు సినిమాలు తెలుగు తెరమీదకు వస్తున్నాయి. రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు. రెండు డబ్బింగ్ సినిమాలు. తమిళం నుంచి ఒకటి. కన్నడ నుంచి మరోటి. దీపావళికి విడుదలవుతున్నాయి నాలుగు. కానీ వాటిలో రెండు ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అమావాస్య సెంటిమెంట్ కనుక, ముందు రోజ్ వేసేస్తున్నారు ప్రీమియర్ల పేరుతో.
విడుదల ముందు బజ్, మార్కెట్ అంచనాలు, సినిమా జానర్ అన్నీ చూసి బేరీజు వేస్తే, కన్నడ డబ్బింగ్ సినిమా బఘీరా అన్నింటికన్నా వెనుకగా వుంది. పెద్దగా పరిచయం లేని నటులు కావడం, రొటీన్ ట్రయిలర్ కావడం కారణాలు కావచ్చు. పశ్రాంత్ నీల్ కథ అనే పాయింట్ తప్పిస్తే మరో పాజిటివ్ ఫ్యాక్టర్ లేదు.
తమిళం నుంచి వస్తున్న అమరన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవి. ఫీల్ గుడ్ ట్రయిలర్. మంచి ప్రచారం.. అంతా ఒకె. కానీ క్లాస్ సినిమా అవుతుంది అనే అభిప్రాయాలు. మల్టీ ప్లెక్స్ ల్లో చాలా బాగా అడుతుంది అనే కామెంట్లు.
మిగిలిన రెండు తెలుగు సినిమాలు. లక్కీ భాస్కర్, క. ఇక్కడ లక్కీ భాస్కర్ కు అన్ని విధాలా అడ్వాంటేజ్ వుంది. పెద్ద బ్యానర్, ప్రూవ్డ్ దర్శకుడు. దుల్కర్ సల్మాన్.. మీనాక్షి చౌదరి. ఇలా ఫుల్ ప్యాకేజ్ వుంది. ట్రయిలర్ ఓకె. పాటలు ఒకె. ఇక మిగిలింది ఈ సబ్జెక్ట్, ఈ జానర్ తెరమీదకు ఎలా వచ్చిందా అన్నదే. ఇప్పటి వరకు సబ్జెక్ట్ ఎలా డీల్ చేసి వుంటారు అన్నది అంతగా తెలియదు. తెరమీదకు వచ్చిన తరువాతే క్లాస్ సినిమా అవుతుందా? ఫ్యామిలీ సినిమా అవుతుందా? మాస్, యాక్షన్ థ్రిల్లర్లు నచ్చే యూత్ ను కూడా అకట్టుకుంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
క సినిమా పేరే చిత్రంగా వుంది. కానీ గమ్మత్తుగా జనంలోకి ఈ టైటిల్ బాగానే వెళ్లింది. చిన్న హీరో, చిన్న బ్యానర్, కొత్త దర్శకులు. కానీ ఈ జనరేషన్ జనాలకు అసక్తికరమైన జానర్. మిస్టిక్ థ్రిల్లర్. అదే క సినిమాకు అతి పెద్ద అడ్వాంటేజ్. ట్రయిలర్ ఓకె అనిపించుకుంది. సినిమా ఏమాత్రం ఫరవాలేదు అని అనిపించుకున్నా ముందుకు లీడ్ తీసుకుంటుంది. కానీ మినిమమ్ వుంది అనిపించుకోవాలి.
మొత్తం మీద చూసుకుంటే ‘క’సినిమా చూసేలా వుంది, చూడాలనిపించేలా వుంది.. అనిపించుకుంటే చాలు
లక్కీ భాస్కర్.. కుర్రాళ్లకు కూడా నచ్చింది అనిపించుకోవాలి.
అమరన్.. సినిమా అద్భుతం అనిపించుకోవాలి.
బఘీరా సడెన్ సర్ప్రయిజ్ ఇవ్వాలి
అప్పుడు వుంటుంది అసలైన దీపావళి థియేటర్ల దగ్గర.
ఎలాగూ వీటిని థియేటర్ లో చూడం, ఎలా ఉంటె ఏంటి
Call boy works 9989793850
యాత్ర 2 రీ రిలీజ్ ఎప్పుడు??