జాన్వి కపూర్ టాలీవుడ్ లో ఆల్రెడీ అడుగుపెట్టింది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమా చేసింది. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఆమె ఎంతమంది హీరోల సరసన చేసినప్పటికీ అవన్నీ ఒకెత్తు.. అక్కినేని హీరోలతో ఆమె నటించడం మరో ఎత్తు.
అక్కినేని కుటుంబానికి, శ్రీదేవికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తరాలకు చెందిన నటులతో శ్రీదేవి నటించారు. ఏఎన్నార్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన శ్రీదేవి, ఆ తర్వాత నాగార్జునతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇప్పుడు ఆమె కూతురు జాన్వి కపూర్, అక్కినేని మూడోతరం హీరోతో నటించబోతోందట. అందుకే ఇది ప్రత్యేకం. నాగచైతన్య, శివ నిర్వాణ కలిసి మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇంతకుముందు ‘మజిలీ’ చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో ఎమోషనల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో జాన్వి కపూర్ ను తీసుకోవాలనేది ఆలోచన. ఇది ఏ మేరకు సాధ్యమౌతుందో చూడాలి. కుదిరితే మాత్రం.. అక్కినేని హీరోలకు, శ్రీదేవి కుటుంబానికి మధ్య ఉన్న బంధం మరో తరం కొనసాగినట్టే. ప్రస్తుతం ‘తండేల్’ పనిలో బిజీగా ఉన్నాడు నాగచైతన్య.
Call boy jobs available 9989793850
One more tollywood waste movie
నీ లాంటి పనికిమాలిన వెధవలకు పని పాట వుండదేమో నీ కన్నా వెస్ట్ గాళ్ళు ప్రపంచం లో వేరొకరు వుండరు నాగ చైతన్య ను కామెంట్ చేసే అర్హత నీలాంటి వాళ్లకు ఉందా ఒక్కసారి పోల్చి చూసుకో.చైతూ కాలి బూట్లు తుడవడానికి కూడా పనికిరావు. అది ని అర్హత
Tollywood waste movie 0.5 supporters never stops crying
vc available 9380537747
sridevi telugu lo 38 films chese andulo 31 films krishna గారితో chesindi..