నాకూ పిల్లలు కావాలి – నాగచైతన్య

2 రోజుల కిందటి సంగతి. హీరోయిన్ సమంత మాతృత్వంపై స్పందించింది. తను తల్లి కావాలని కలలు కన్నానని వెల్లడించింది. అదొక పరిపూర్ణమైన అనుభూతి అని, మాతృత్వాన్ని ఆస్వాదించడానికి వయసు అడ్డంకి కాదని చెప్పుకొచ్చింది. Advertisement…

2 రోజుల కిందటి సంగతి. హీరోయిన్ సమంత మాతృత్వంపై స్పందించింది. తను తల్లి కావాలని కలలు కన్నానని వెల్లడించింది. అదొక పరిపూర్ణమైన అనుభూతి అని, మాతృత్వాన్ని ఆస్వాదించడానికి వయసు అడ్డంకి కాదని చెప్పుకొచ్చింది.

ఆమె అలా స్టేట్ మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకే నాగచైతన్య నుంచి ఇదే అంశంపై స్టేట్ మెంట్ రావడం విశేషం. హీరో నాగచైతన్య పిల్లలపై స్పందించాడు. “హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే బాగుంటుంది.” అనేది నాగచైతన్య స్టేట్ మెంట్. అయితే వెంకీ మామలా నలుగురు పిల్లలు మాత్రం వద్దని చమత్కరించాడు.

వైవాహిక బంధానికి ముగింపు పలికి, విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ ఇలా పిల్లలపై స్టేట్ మెంట్ ఇవ్వడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.

ఈ విషయంలో నాగచైతన్య కాస్త ముందున్నాడనే చెప్పాలి. వచ్చే నెల అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. శోభిత మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. ఆ వెంటనే ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాడు. సమంత మాత్రం ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంది.

6 Replies to “నాకూ పిల్లలు కావాలి – నాగచైతన్య”

  1. వీరి కుటుంబం ఊరకుక్కల మీద చూపే ప్రేమలో లక్షవ వంతైనా వీధిబాలల మీద చూపి, వారిని దత్తతు చేసుకోవచ్చుగా. మనుషులూ జంతువుల నుండే వచ్చారు అని అవగాహన లేదా?

Comments are closed.