ఎమర్జెన్సీ.. ఈ ఏడాది కాదు

లెక్కప్రకారం సెప్టెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ప్రతి నెల వాయిదా పడుతూనే ఉంది. ఈమధ్య అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఏ క్షణానైనా సినిమా రిలీజ్ అవుతుందని అంతా ఎదురుచూశారు. కానీ…

లెక్కప్రకారం సెప్టెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ప్రతి నెల వాయిదా పడుతూనే ఉంది. ఈమధ్య అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఏ క్షణానైనా సినిమా రిలీజ్ అవుతుందని అంతా ఎదురుచూశారు. కానీ ఎమర్జెన్సీ మూవీ ఈ ఏడాది రిలీజ్ అవ్వడం లేదు.

అన్నీతానై సినిమాను తెరకెక్కించిన కంగనా రనౌత్, ఎమర్జెన్సీ చిత్రాన్ని జనవరి 17న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఫ్యాన్స్ కు ఇది కాస్త నిరాశపరిచే విషయమే అయినప్పటికీ, మార్కెట్ పరంగా చూసుకుంటే కంగనా నిర్ణయం సరైనదే.

బాలీవుడ్ బాక్సాఫీస్ లో జనవరి 17 నాటికి పెద్దగా పోటీ లేదు. పైగా ఈ 2 నెలల కాలాన్ని ప్రచారం కోసం ఆమె సద్వినియోగం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆమెకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఈ టైమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎమర్జెన్సీ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడి విడుదల ఆలస్యమవ్వడంతో.. కంగనా తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. తనే స్వయంగా డైరక్ట్ చేసి నిర్మించింది కూడా.

అందుకే ఈ సినిమా ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకం. మరీ ముఖ్యంగా ఎంపీగా గెలిచిన తర్వాత కంగనా నుంచి వస్తున్న సినిమా ఇది.

One Reply to “ఎమర్జెన్సీ.. ఈ ఏడాది కాదు”

Comments are closed.