ఎఫైర్లపై పూర్తిస్థాయిలో స్పందించిన నయనతార

నయనతార తన పాత రిలేషన్ షిప్స్ పై సవివరంగా స్పందించింది. శింబు, ప్రభుదేవా లాంటి పేర్లు బయటపెట్టకుండా, ప్రతి డేటింగ్ పై తన వెర్షన్ వినిపించింది.

నయనతారపై డాక్యుమెంటరీ వస్తుందనగానే అందర్లో ఒకటే సందేహం. ఆమె ఎఫైర్లను కూడా అందులో చర్చిస్తారా అని. అలాంటివి టచ్ చేయకుండా మిగతాదంతా కవర్ చేస్తారని అనుకున్నారు.

కానీ నయనతార మాత్రం తన పాత రిలేషన్ షిప్స్ పై సవివరంగా స్పందించింది. శింబు, ప్రభుదేవా లాంటి పేర్లు బయటపెట్టకుండా, ప్రతి డేటింగ్ పై తన వెర్షన్ వినిపించింది.

కెరీర్ ప్రారంభంలోనే శింబుతో ప్రేమలో పడింది నయన్. కానీ అది బ్రేకప్ అయింది. దీనికి తనదైన కారణం చెప్పుకొచ్చింది నయనతార. ప్రేమలో ప్రతిది నమ్మేస్తామని, ప్రేమకు పునాది నమ్మకమని, తను కూడా అదే నమ్మకం పెట్టుకున్నానని తెలిపింది. కానీ ఆ వ్యక్తి మాత్రం తన నమ్మకాన్ని వమ్ము చేశాడని, నిజానికి అతడు తనను ప్రేమించనేలేదని వెల్లడించింది. నయన్-శింబు లిప్ కిస్ ఫొటోలు అప్పట్లో లీక్ అయి సంచలనం సృష్టించాయి.

ప్రభుదేవాతో ఎఫైర్ గురించి కూడా స్పందించింది. కెరీర్ పరంగా, లైఫ్ పరంగా చాలా కీలకమైన దశలో ఉందప్పుడు. ఆ టైమ్ లో కెరీర్ వదులుకోవాలని, సినిమాలు మానేస్తేనే పెళ్లి అనే కండిషన్ పెట్టారట. లైఫ్ సెటిల్ అవుతుందనే నమ్మకంతో నయనతార సినిమాలు మానేద్దామని డిసైడ్ అయిందంట.

ఆ టైమ్ లో శ్రీరామరాజ్యమే తన చివరి చిత్రమని చెబుతోంది నయన్. అందరికీ అదే విషయం చెప్పానని, కానీ ఆ తర్వాత తన జీవితంలో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయని వెల్లడించింది. ఎవరి వల్ల తను మోసపోయానో, ఆ వ్యక్తి కళ్లముందే ఎదగాలని, ప్రతి రోజూ ఆ వ్యక్తి తనను చూసి ఈర్ష్య పడేలా ఎదగాలని ఆ క్షణమే నిర్ణయించుకొని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందంట నయన్.

ఇక విఘ్నేష్ శివన్ తో ఆమె ఎలా ప్రేమలో పడింది, పెళ్లి-పిల్లలు లాంటి విషయాలు అందరికీ తెలిసినవే.

14 Replies to “ఎఫైర్లపై పూర్తిస్థాయిలో స్పందించిన నయనతార”

  1. ఏం చెప్పావు తల్లి.పెళ్ళై పిల్లలున్న ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకోవడమే కాక పెళ్ళి దగ్గరకి వచ్చేసరికి పిల్లల్ని వదిలేస్తేనే నీతో పెళ్ళి అని కండిషన్ పెట్టీ ఇప్పుడు ఇలా మాట్లాడటమా? అయినా ఆడవాళ్ళకే సానుభూతి ఉంటుందని తెలిసి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవచ్చు.

  2. సినిమా వాళ్లకి నీతులు రీతులు ఏముండవు. డబ్బే ప్రధానం. మళ్లీ నీతులు చెప్తారు.

  3. శింబు గారు మరియు ప్రభు దేవా గారి వెర్షన్ కూడా ఆడ్ చేయాల్సింది ఇంకా ఎక్కువ బిజినెస్ & వ్యూస్ వచ్చేవి

  4. తెర వెనుక ఎన్నున్నా తెర ముందు ఎలా ఉండాలో జ్యోతిక కాజల్ హన్సిక వంటి వారిని చూసి నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళు…

Comments are closed.