మళ్లీ సెట్స్ పైకి పవన్.. ఈసారి ఏమౌతుందో!?

మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయాని అంతా అనుకున్న టైమ్ లో, సినిమా సెట్స్ పైకి వచ్చారు.

ఆమధ్య ఒకసారి సెట్స్ పైకి వచ్చారు పవన్. హమ్మయ్య వచ్చారు అనుకునేలోపే తిరిగెళ్లిపోయారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు కొన్ని విషయాలు ఆయన చేతిలో ఉండవు. అటు వెళ్లాల్సిందే. అప్పుడు కూడా అదే జరిగింది. ఫలితంగా హరిహర వీరమల్లు డైలమాలో పడింది.

అలా ఆగిన సినిమాను ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించారు పవన్. ఈరోజు ఆయన విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో తిరిగి జాయిన్ అయ్యారు. పవన్ కోసం కొన్ని నెలలుగా ఆ సెటప్ ను అలానే ఉంచిన సంగతి తెలిసిందే.

దాదాపు 2 నెలల విరామం తర్వాత పవన్ తిరిగి షూట్ స్టార్ట్ చేశారు. ఈసారి ఆయన టోటల్ సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది హరిహర వీరమల్లు పార్ట్-1 మాత్రమే. పార్ట్-2 సంగతి తర్వాత.

మొన్నటివరకు ఆయన ఢిల్లీలో బిజీగా గడిపారు. ప్రధానిని కలిశారు, కొంతమంది కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఏపీలో ఇలా ల్యాండ్ అవుతూనే, కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేశారు. అలా ఆయన మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయాని అంతా అనుకున్న టైమ్ లో, సినిమా సెట్స్ పైకి వచ్చారు.

క్రిష్ పక్కకు తప్పుకోవడంతో, జ్యోతి కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

16 Replies to “మళ్లీ సెట్స్ పైకి పవన్.. ఈసారి ఏమౌతుందో!?”

Comments are closed.