తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మంత్రిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ గురుకుల బాట అనగానే కాంగ్రెస్‌కు భయం పట్టుకుంటుంది. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నట్లు ఆధారాలతో బయటపెట్టి, సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కొండా సురేఖను గతంలోనే తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలపై కోర్టు కేసు పెట్టాలని ఆదేశించింది. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని.. ఏడేళ్లు సర్వీస్ ఉన్నా విద్యార్థుల కోసం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నాపై ఇలాంటి విమర్శలు దారుణం అన్నారు.
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. “కొండా మురళి వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడని.. 2002లో నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చారని.. దానికి సాక్ష్యం అప్పటి సీఐ, ప్రస్తుత వర్ధన్ పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అని అన్నారు. గతంలో కొండా మురళి ఇంకా చాలా దారుణాలు చేశాడంటూ గుర్తుచేశారు.
కాగా, ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పలు ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ విద్యార్థిని ఫుడ్ పాయిజన్ వల్ల మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కల్తీ ఆహారం నియంత్రణకు ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, అధికారులు హాస్టళ్ళను సందర్శించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
Call boy works 7997531004
vc estanu 9591176881