అనుమతి తీసుకున్నారట.. పేర్లు చెప్పరంట!

కొత్త ప్రాజెక్టు ప్రకటించినప్పట్నుంచి దర్శకుడు వైవీఎస్ చౌదరి వ్యవహారశైలి భిన్నంగా ఉంటూ వస్తోంది. నందమూరి వంశంలో కొత్తతరం హీరోను పరిచయం చేస్తున్న ఈ డైరక్టర్… తనకు కుటుంబంలోని అందరి ఆశీస్సులు ఉన్నాయంటారు. ఎన్టీఆర్, కల్యాణ్…

కొత్త ప్రాజెక్టు ప్రకటించినప్పట్నుంచి దర్శకుడు వైవీఎస్ చౌదరి వ్యవహారశైలి భిన్నంగా ఉంటూ వస్తోంది. నందమూరి వంశంలో కొత్తతరం హీరోను పరిచయం చేస్తున్న ఈ డైరక్టర్… తనకు కుటుంబంలోని అందరి ఆశీస్సులు ఉన్నాయంటారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లాంటి హీరోల పేర్లను మాత్రం తన నోటితో ఉచ్ఛరించరు. గట్టిగా అడిగితే నందమూరి హీరోల లిస్ట్ తీసుకొని రండి కింద సంతకం పెడతానంటున్నారు. అసలు ఎందుకింత డొంక తిరుగుడు?

స్ట్రయిట్ గా ప్రశ్న సంధించినా, వంకరగానే సమాధానం చెబుతానంటూ ప్రకటించి మరీ అస్పష్టంగా మాట్లాడుతున్నారు వైవీఎస్ చౌదరి. నందమూరి తారకరామారావు (దివంగత జానకీరామ్ కొడుకు, హరికృష్ణ మనవడు)ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ దర్శకుడు.. జానకిరామ్ భార్య కొన్ని కండిషన్స్ పెట్టారని, ఆ రూల్ బుక్ ప్రకారం తను నడుచుకున్నానని మాత్రం అంటున్నారు. అందులో రూల్స్ ఏంటని అడిగితే మాత్రం చెప్పరు.

ఓ పెద్ద కుటుంబం నుంచి కొత్త హీరో మార్కెట్లోకి వస్తున్నప్పుడు.. ఆ కుటుంబంలోని ఇతర హీరోల మద్దతు తప్పనిసరి. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలన్నా.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాలన్నా వాళ్ల మద్దతు ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు అత్యవసరం.

ఇవన్నీ వైవీఎస్ చౌదరికి తెలియనివి కావు. కానీ ఆయన వంకరగానే సమాధానం ఇస్తారు. నేను ఏం చేస్తున్నాను, నా డైరీలో వివరాలు మీకెందుకంటూ ప్రశ్నిస్తారు.

ఆయన ఇప్పటికిప్పుడు ఎవరి పేర్లు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే.. తారక్ పేరు ప్రస్తావించకుండానే ఆయన సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు కూడా. కానీ ఓ కొత్త హీరో లాంఛింగ్ కు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లాంటి హీరోల మద్దతు ఉంటే ఆ రేంజ్ వేరు. ఎవరూ లేకపోతే అనుకోవచ్చు, ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని ఎందుకీ ఈగోలు. ఇంతకీ ఎవరికి ఈగో? లేక వాళ్లలో వాళ్లకు ఏమైనా అభిప్రాయబేధాలున్నాయా?

13 Replies to “అనుమతి తీసుకున్నారట.. పేర్లు చెప్పరంట!”

  1. Chowdari గారు ..మీ interviews మీరె ఒ సారి చుసుకొండి ..

    చాల ఎబ్బెట్టుగా వుంటాయి…..ఎందుకీ శ్రుతిమించిన overaction

  2. నందమూరి, మెగా ఫాన్స్ లో చీలిక ని గొడవలు రాజేయడానికి ఇలా జు ఎన్టీఆర్ ని అర్జున్ ని ఎంటర్టైన్ చేసే ల రాతలు రాస్తూనే ఉంటారు….

      1. నా పేరు నీకెందుకు రా ???నువ్వు పెట్టుకున్న పేరు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి రా ???

Comments are closed.