ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీ

అమెరికా టాప్-10 తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు. పుష్ప-2 సినిమా 9.4 మిలియన్ డాలర్ల (అన్ని భాషల్లో కలిపి) వసూళ్లతో యూఎస్ లో దూసుకుపోతోంది.

యూఎస్ టాప్-10 తెలుగు చిత్రాల్లో డామినేషన్ అంతా ప్రభాస్ దే. అగ్రస్థానం బాహుబలి-2ది కాగా, తాజాగా కల్కి సినిమాతో రెండో స్థానం కూడా ప్రభాసే కైవసం చేసుకున్నాడు. ఇలా చూసుకుంటే.. టాప్-10లో బాహుబలి-2, కల్కితో పాటు సలార్, బాహుబలి-1 సినిమాలు కూడా ఉన్నాయి.

ఇదే టాప్-10లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కొనసాగుతున్నారు. అయితే బన్నీకి మాత్రం ఇప్పటివరకు ఉన్నది ‘అల వైకుంఠపురములో’ సినిమా మాత్రమే. పైగా హనుమాన్, దేవర లాంటి సినిమాల రాకతో మెల్లమెల్లగా ఒక్కో స్థానం కిందకు జారిపోతోంది ‘అల వైకుంఠపురములో’ సినిమా. పుష్ప-1 యూఎస్ లో రికార్డులు సృష్టించే స్థాయిలో ఆడలేదు.

ఇలాంటి టైమ్ లో పుష్ప-2 సినిమాతో ఓవర్సీస్ లో బన్నీ తన సత్తా చాటాల్సిన అవసరం వచ్చింది. మరీ ముఖ్యంగా డాలర్ల వేటలో అతడు ఎలైట్ టాప్-5 క్లబ్ లోకి కచ్చితంగా అడుగుపెట్టాలి. ఇప్పుడా తరుణం రానే వచ్చింది.

అమెరికా టాప్-10 తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు. పుష్ప-2 సినిమా 9.4 మిలియన్ డాలర్ల (అన్ని భాషల్లో కలిపి) వసూళ్లతో యూఎస్ లో దూసుకుపోతోంది. ఈ ఒక్క సినిమాతో ఏకంగా టాప్-4కు చేరుకున్నాడు బన్నీ.

ప్రస్తుతం టాప్-10 టాలీవుడ్ గ్రాసర్స్ లిస్ట్ లో బాహుబలి-2, కల్కి, ఆర్ఆర్ఆర్ తర్వాత పుష్ప-2 కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ ను అధిగమించే అవకాశాలు పుష్ప-2కు పుష్కలంగా ఉన్నాయి.

ఎందుకంటే, యూఎస్ లో ఇప్పట్లో పుష్ప-2 హవా తగ్గేలా లేదు. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరో వారం రోజులు ఇదే ట్రెండ్ కొనసాగితే ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్ (14.83 మిలియన్ డాలర్లు) ను పుష్ప-2 దాటేస్తుందనే అంచనాలున్నాయి.

యూఎస్ టాప్-5 తెలుగు మూవీస్ లో మొన్నటివరకు బన్నీ సినిమా లేదు. కనీసం 5 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా అతడు లేడు. దేవరతో ఎన్టీఆర్ రీసెంట్ గా ఈ క్లబ్ లోకి ఎంటరయ్యాడు. హనుమాన్ సినిమాతో తేజ సజ్జా కూడా ఇందులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు పుష్ప-2తో బన్నీ అన్ని రికార్డులు దాటుకుంటూ దూసుకుపోతున్నాడు.

5 Replies to “ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీ”

Comments are closed.