స‌జ్జ‌ల‌ను తిడుతున్న వైసీపీ శ్రేణులు

వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని వైసీపీ శ్రేణులు తిడుతున్నాయి.

వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని వైసీపీ శ్రేణులు తిడుతున్నాయి. ఈ నెల 13న రైతాంగం స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి వైసీపీ నాయ‌కుల‌తో సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ప్ర‌తి జిల్లాలో క‌నీసం ఐదు వేల మంది కార్య‌క‌ర్త‌ల‌కు త‌క్కువ కాకుండా కార్య‌క్ర‌మంలో పాల్గొని విజ‌యవంతం చేయాల‌నే అధ్య‌క్షుడి ఆదేశాల‌ను ఆయ‌న వివ‌రించారు. కేవ‌లం విన‌తిప‌త్రాలు ఇచ్చే కార్య‌క్ర‌మం అని చెబుతూనే, ఇంత పెద్ద సంఖ్య‌లో శ్రేణుల స‌మీక‌ర‌ణ ఎందుక‌నేది ఎవ‌రికీ అర్థం కాని విష‌యం.

ఇదే సంద‌ర్భంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల కోపానికి కార‌ణం ఏంటంటే… క‌నీసం జ‌గ‌న్‌ను ప‌ల‌క‌రించ‌డం ప‌క్క‌న పెడితే, చూడ‌నివ్వ‌డం లేద‌ని. తాడేప‌ల్లి వ‌ర‌కూ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వెళితే, అక్క‌డ సెక్యూరిటీ వెళ్లే బ‌య‌టికి తోసేస్తున్నార‌ని, ఇప్పుడు మాత్రం వైఎస్ జ‌గ‌న్ ఆదేశాలంటే స‌జ్జ‌ల టెలికాన్ఫ‌రెన్స్‌లో చెప్ప‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

తాడేప‌ల్లిలో జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి వెళ్లిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను సెక్యూరిటీ సిబ్బంది లోప‌లికి పంప‌డం లేదు. జ‌గ‌న్ పీఎస్ కేఎన్ఆర్‌, లేదా కృష్ణ‌మోహ‌న్‌రెడ్డితో త‌మ‌కు చెప్పించాల‌ని సెక్యూరిటీ సిబ్బంది నిర్మొహ‌మాటంగా తేల్చి చెబుతున్నార‌ని అంటున్నారు. కానీ పార్టీ కార్య‌క‌లాపాల‌కు మాత్రం త‌మ అవ‌స‌రం వ‌చ్చిందా? అని నిల‌దీస్తున్నారు.

తాడేప‌ల్లిలో జ‌గ‌న్ ఇంటి వ‌ర‌కూ వెళ్లిన వాళ్ల‌కు ఆయ‌న ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌నే స్పృహ ఆయ‌న స‌ల‌హాదారుడైన స‌జ్జ‌ల‌కు లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్‌కు పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని చేరువ చేయ‌లేని స్థితిలో ఉన్న‌ప్పుడు, త‌మ‌కు ఆదేశాలు ఇవ్వ‌డం ఎందుక‌నేది వారి ప్ర‌శ్న. కూట‌మి ప్ర‌భుత్వం ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కేసులు పెట్టి వేధించ‌డం కంటే, జ‌గ‌న్‌ను దూరం చేయ‌డం త‌మ‌ను ఎక్కువ బాధిస్తోంద‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వాపోతున్నారు.

11 Replies to “స‌జ్జ‌ల‌ను తిడుతున్న వైసీపీ శ్రేణులు”

  1. జగన్ సీఎం గా ఉన్నప్పుడు వీడే మొత్తం నడిపి సంక నాకించాడు.

    పార్టీ ని మింగబెట్టిన తర్వాత కూడా వీడే .!!

    మరి జగన్ పె*ళ్ళాం తొంగోతానికి తప్ప మరియెందుకు pabikiraadaa .??

  2. మావోడు మీడియా కి భయపడి ప్యాలెస్ లో తొంగుంటే పార్టీ and ప్రభుత్వ వాయిస్ మీడియా కి బలంగా వినిపించి పరువు కాపాడింది జెగ్గుల్ మ0చం మేట్ సజ్జల్ కదా గ్రేట్గ్యాసు ??

Comments are closed.