‘మంచు’ వివాదం మొదలు అక్కడే?

తన వర్కర్‌ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది.

మంచు మోహన్ బాబు కుటుంబం డిసిప్లిన్‌కు పెట్టింది పేరు. అలాంటి కుటుంబం ఇప్పుడు బజారున పడింది. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఫిర్యాదులు చేసుకున్నారు. ఒకప్పుడు ఏ మీడియా కూడా ఆ కుటుంబం జోలికి వెళ్లేది కాదు. లేనిపోని తలనొప్పులు ఎందుకు అని. కానీ ఇప్పుడు మాంచి వార్తల ఆకలి మీద ఉన్న మీడియాకు అదే మంచు కుటుంబం వార్తలు ప్రధానంగా అయ్యాయి. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది? కేవలం ఆస్తుల వివాదమేనా? అంతకు మించి ఏమన్నా ఉందా?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆస్తుల వివాదం అన్నది అలా స్తబ్దంగా ఉండగా, ఇటీవల వేరే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

గత కొన్నాళ్లుగా మంచు విష్ణు కుటుంబ సమేతంగా తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. శంషాబాద్ దగ్గరలోని ఆ ఇంట్లో ఉంటున్నారు. అక్కడ మొదటి నుంచీ ఉన్న వర్కర్లు ఉన్నారు. మనోజ్ అతని భార్య వైపు నుంచి వచ్చిన వర్కర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు బాగా సేవలు చేసే, అతి సన్నిహితమైన మేల్ వర్కర్‌కు, మనోజ్ కుటుంబానికి సేవలు చేసే లేడీ వర్కర్‌కు మధ్య ఏదో జరిగింది. ఈ విషయంలో ఆ మేల్ వర్కర్‌ను మనోజ్ గట్టిగా కొట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వర్కర్ డ్యూటీకి కొన్ని రోజులు రాలేదు. మోహన్ బాబు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

దాంతో తన వర్కర్‌ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది. “భార్య వల్లే మనోజ్‌ను ఇంట్లోకి రానిచ్చాను” అనే విధంగా. “తన తల్లి మీదకు వెళ్తావా?” అని తండ్రితో మనోజ్ గొడవ పెద్దదిగా చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద చిన్న విషయం చినికి చినికి గాలివానగా మారింది.

ఇప్పుడు అది కాస్తా పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కింది. ఇక ఇక్కడితో ఆగితే కుటుంబ గౌరవం నిలబడుతుంది. లేదంటే మీడియా చలి కాచుకోవడం అన్నది పెరుగుతుంది.

23 Replies to “‘మంచు’ వివాదం మొదలు అక్కడే?”

  1. ఇలాంటి పిండాకోరు పనుల్లో నిన్ను మించిన అల్ప సంతోషి గాడు ఇంకెవరుంటారు గులాంద్రా

  2. పాపం GA గారు, అవునన్నా కాదన్నా ఉడతా భక్తి కింద అయినా మీ పార్టీ కి సపోర్ట్ చేసిన ఏకైక కుటుంబం, పాపం వాళ్ళ కర్మ అలా వుంటే వాళ్ళ మీదే ఎదో ఒక రాతలు రాసుకుంటున్నావు కనీసం కొంచం అన్నా కనికరం లేదా

  3. మీరూ మీరూ మింగించుకోగా లేనిది….పని వాళ్ళు మింగించుకుంటే మీకెంది రా ఈ దూ….ల

  4. Please don’t use bad words & unknown things of Legendary Hero Families. Everyone having their own problems. This media also without knowing real facts, simply writing for their TRP rating purpose.

  5. అసలు కథ రాయి స్వామి. జల్ పల్లి లో వున్న మోహన్ బాబు మాన్షన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీనిని విష్ణు అన్నియ్య కి ఇచ్చే ఉద్దేశ్యం లో మోహన్ బాబు వున్నాడు. దాని మీద అంతగా ద్రుష్టి పెట్టని మనోజ్ కు వాళ్ళ అమ్మ కోరిక మీదట పిల్లను భార్యను అక్కడకు పంపి వాళ్ళకయ్యే ఖర్చులను, మనుషులను కూడా తానే పెట్టుకున్నాడు. వాళ్ళనుఅక్కడే ఉంచాలని మనోజ్ అమ్మ కోరిక ఇప్పుడు నెరవేరడం లేదు. వీటన్నిటిని కన్నప్ప vfx పనులతో దుబాయ్ బిజీ గ ఉన్నట్టు చెప్తున్నా విష్ణు అన్నియ్య ఒక కాను ఇటు వేసి ఉంచాడు మరియు తనకి నచ్చలేదు, అక్కడి నుంచే చక్రం తిప్పాడు. తన పనివాళ్ళతో గొడవలు సృష్టించాడు. విష్ణు అన్నియ్య తలచినట్టుగానే, అవి మోహన్ బాబు మనోజ్ కొట్టుకునే స్టేజి కి వచ్చాయి.

    ఇక్కడ మోహన్ఈ బాబు చెప్తున్నట్టు ఆస్తులన్నీ అయన స్వయం సంపాదన మరియు అమ్ముకున్న, దానం చేసిన అడిగే వారు లేరు, కానీ పంపకానికి వస్తే, ఇద్దరి కుమారులకు సమన హక్కు ఉంటుందని మర్చిపోకూడదు. మోహన్ బాబు తదనంతరం ఇద్దరికీ సమానం గ విభజించాపడతాయి. కానీ మోహన్ బాబు బ్రతికి ఉండగా ఈ పంపకాలు మీడియా వాళ్ళు చూసే అవకాశం రాకపోవచ్చు. ఈ ఉదంతం లో అంతంత మాత్రం వున్నా మోహన్బాబు పరువు మూసి లో కలిసింది. ఇంకా ట్రోల్ల్స్ కి సంక్రాంతి పండగ ఒక నెల ముందే వచ్చినట్టు.

  6. మోహన్ బాబు ఇప్పుడుంటున్న టౌన్షిప్ సినీ నటి సౌందర్య కు చెందినది అని, ఆమె చనిపోగానే బాబు క#బ్జా చేశాడని వార్తలు వస్తున్నాయి. మీడియా దీని మీద ఫోకస్ చేసి నిజాలు తేల్చాలి.

  7. మోహన్ బాబు ఇప్పుడుంటున్న టౌన్షిప్ సినీ నటి సౌందర్య కు చెందినది అని, ఆమె చనిపోగానే మోహన్ బాబు #క# #బ్జా# చేశాడని వార్తలు వస్తున్నాయి. మీడియా దీని మీద ఫోకస్ చేసి నిజాలు తేల్చాలి.

  8. మోహన్ బాబు ఇప్పుడుంటున్న టౌన్షిప్ సినీ నటి సౌందర్య కు చెందినది అని, ఆమె చనిపోగానే మోహన్

  9. బాబు #క# #బ్జా# చేశాడని వార్తలు వస్తున్నాయి. మీడియా దీని మీద ఫోకస్ చేసి నిజాలు తేల్చాలి.

  10. మనోజ్ మీద ఎంత సాఫ్ట్ కార్నర్ వున్నా, ఈ ఆస్తులన్నీ మంచు పెద్దాయన సంపాదన. ఎవరికీ రాసివ్వాలో, రాయకూడదు అనేది పూర్తిగా తాతగారి ఇష్టం. మనోజ్ చేసింది మాత్రం తప్పు.

Comments are closed.