తండ్రీకొడుకు.. అన్నాత‌మ్ముడు.. ఇదీ కేబినెట్!

ప‌వ‌న్ విలువ‌ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అదే ఆయ‌న‌తో స‌మ‌స్య‌. పోనీ వాటిని పాటిస్తారా?

ప్రాంతీయ పార్టీల్లో ప్ర‌జాస్వామ్యం పేరుతో వ్య‌క్తం స్వామ్యం న‌డుస్తోంటోంది. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేక‌మంటూ విమ‌ర్శ‌లు చేసే బీజేపీ, ప‌వ‌న్‌క‌ల్యాణ్ భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉన్న కేబినెట్‌లో జ‌రుగుతున్న‌దేంటి? తండ్రీకొడుకులైన చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ సీఎంగా, మంత్రిగా కొన‌సాగుతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే, ఒట్టు తీసి గ‌ట్టున పెడుతున్నారు. త‌న అన్న నాగ‌బాబుకు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించేలా చంద్ర‌బాబును ఒప్పించారు. ఈ మేర‌కు బాబుతో ప్ర‌క‌ట‌న కూడా ఇప్పించి క‌మిట్ చేయించారు. కుటుంబ, వార‌స‌త్వ పాల‌న గురించి మాట్లాడ‌క‌పోయి వుంటే, ప‌వ‌న్‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించే వారు కాదు.

ప‌వ‌న్ విలువ‌ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అదే ఆయ‌న‌తో స‌మ‌స్య‌. పోనీ వాటిని పాటిస్తారా? అంటే.. అంద‌రి కంటే ముందు అతిక్ర‌మించేది ఆయ‌నే అనే చెడ్డ పేరు సంపాదించుకున్నారు. మొత్తానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన‌లో త‌న అన్న‌కు న్యాయం చేయ‌డానికి మార్గాన్ని సుగుమం చేసుకున్నారు. మ‌రి మిగిలిన నాయ‌కుల సంగ‌తేంటి? అస‌లు ఎమ్మెల్సీ కూడా కాని నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌విని ఖరారు చేసుకుంటే, ఎన్నికైన జ‌న‌సేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వుండ‌దా?

కూట‌మి కేబినెట్‌లో వార‌స‌త్వ రాజ‌కీయాలు మూడు పువ్వులు, ఆరుకాయ‌లుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవ‌న్నీ రాజ‌కీయంగా మైన‌సే. నాగ‌బాబుకు హోంశాఖ మంత్రి ప‌ద‌వి ఇస్తే, శాంతిభ‌ద్ర‌త‌ల్ని, అలాగే మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల్ని అరిక‌ట్ట‌డానికి అవ‌కాశం వుంటుందేమో. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఈ విష‌య‌మై మాట్లాడుకుని నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంది.

29 Replies to “తండ్రీకొడుకు.. అన్నాత‌మ్ముడు.. ఇదీ కేబినెట్!”

  1. వాళ్ళ మధ్య తండ్రి కొడుకు , అన్నా తమ్ముడు సంబంధాలు వున్నాయి.

    మన జగన్ అన్నయ్యకి తండ్రి , బాబాయ్ , అమ్మ , చెల్లి సంబంధాలు కూడా లేక పాయె.

  2. వాళ్ళ మధ్య తండ్రి కొడుకు , అన్నా తమ్ముడు సంబంధాలు వున్నాయి.

    మన అన్నయ్యకి తండ్రి , బాబాయ్ , అమ్మ , చెల్లి సంబంధాలు కూడా లేక పాయె.

  3. వాళ్ళ మధ్య తండ్రి కొడుకు , అన్నా తమ్ముడు సంబంధాలు వున్నాయి.

    మన పులికి తండ్రి , బాబాయ్ , అమ్మ , చెల్లి సంబంధాలు కూడా లేక పాయె.

  4. వాళ్ళ మధ్య తండ్రి కొడుకు , అన్నా తమ్ముడు సంబంధాలు వున్నాయి.

  5. జీవితం మొత్తం హైదెరాబాదులోనే ఉండి! కేవలం 2019 ఎన్నికలకోసమే హైదరాబాద్ నుండి ఓటు హక్కు.. ఆంధ్ర కు తెచ్చుకుని ఇక్కడ తిరిగి.. 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోగానే.. Packup అయిపోయి! హైద్రాబాదుకే పరిమితమై.. అక్కడ నుండి ట్విట్టర్ రాజకీయాలు చేసుకుంటూ.. కేవలం ఎన్నికలకు మాత్రమే 2 నెలల ముందు ఆంధ్ర కు వచ్చి జీవితం మొత్తం తెలంగాణలోనే ఉండే.. నాగబాబు కు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పదవా అది పప్పెష్ ను D0 N g@ దారిలో.. MLC చేసి మంత్రిని చేసినట్టు చెయ్యటమా ఇచ్చే వాడికి పుచ్చుకునే వాడికి ఉండాలి.. కాస్త.. S! గ్గు!?

    ఏం సంబంధం వీడికి ఆంధ్ర కి? ఇక్కడున్న నాయకులకు ఇవ్వకుండా.. వీడికెందుకు MLC పదవి? ఏం ఒరగబెట్టాడని దానితో పాటు ఏకంగా మంత్రి పదవి ? ఆంధ్ర దౌర్భాగ్యం!

    బాలట్ ఎన్నికలు తెస్తే తప్ప ఈ దరిద్రానికి చరమ గీతం పాడలేము!

    1. అరేయ్ ముండా.. జైల్ కి వెళ్లి ..న ఖైది వెధవ..కి సిఎం చేయగా..లేనిది తప్పే కాదులే… ఆదీకాక.. ఇప్పుడు మనోడు ఇంటర్నేషనల్ గా ఫేమస్ ఫ్రాడ్ అయ్యాడు…congartulation

  6. వై వి సుబ్బారెడ్డి కి ఏ అర్హత ఉందని టీటీడీ చైర్మన్ చేశారు చెప్పగలరా. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ చేశారు అది ఏ లెక్కలో చేశారో చెప్పగలరా . విజయమ్మను పార్టీ ప్రెసిడెంట్గా చేశారు అది ఏ లెక్కలు చేశారో చెప్పగలరా. ఏదో నోరు ఉందని అవాకలో చౌవాకులు పేలుతూ ఉండడమేనా ఎప్పుడు ?

    1. “జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెట్టి వారసత్వం రాజకీయాల గురించి మాట్లాడలేదు కదా అన్న” మన లీడర్ గారు మైకు దొరికితే ఏదో మాట్లాడాలని వారసత్వం రాజకీయాలు గురించి గట్టిగానే మాట్లాడారు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి.

  7. నా గ బా బు కీ. మం త్రి ప ద వి. ఇ స్తే. దం డు పా ళ్యం వై సి పి పార్టీ కు క్క ల

    మొ రు గ్గు ల్లు మ మ్ము ల గ్గా. లే వు గ్గా

  8. మరి బాబాయ్ – అబ్బాయ్, అన్న – షెల్లి లాంటి సమీకరణాలు అందరికీ కుదరవు కదా GA గారు

  9. అన్న ఎప్పుడు అంతే వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడుతాడు. వాటిని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మర్చిపోతారు ఎప్పుడూ ఒక మాట మీద ఉండాలి. అది తప్పైనా ఉప్పైనా

Comments are closed.