బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?

మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు?

అభిమానులే తమకు దేవుళ్లు అనే మాయమాటలను దాదాపుగా ప్రతి సినిమా నటుడు కూడా చెబుతూ ఉంటారు. ఆ మాటలు కూడా.. కేవలం ప్రీరిలీజ్ వేడుకల సమయంలో, సక్సెస్ మీట్ లలో మాత్రమే చెబుతూ ఉంటారు. ఇలాంటి మాటలకు మించిన అబద్ధం మరొకటి ఉండదు.

తమ పుట్టిన రోజులకు అభిమానుల నెత్తురు పిండుకునే హీరోలే మనకు కనిపిస్తారు తప్ప.. తమ సంపాదనలో చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి.. అభిమానుల్లో పేదల బాగుకోసం ఏదైనా కార్యక్రమాలు చేపట్టే వారిని మనం ఎన్నడైనా గమనించామా? అస్సలు ఉండదు. అదంతా పక్కన పెడితే.. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక మహిళ మృతి చెందడం ఇవన్నీ.. నటుల మాటలను మరోసారి చర్చల్లోకి తెస్తున్నాయి.

మహిళ మృతి వ్యవహారంలో నిర్వహణ చేతకాకపోయిన థియేటర్ యాజమాన్యంతో పాటు, అసలు తొక్కిసలాటకు కారణమైన హీరో అల్లు అర్జున్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అర్జున్ మాత్రం.. తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లినందుకు నమోదైన కేసును కొట్టేసినట్టే హైకోర్టు ఈ కేసును కూడా కొట్టేస్తుందని ఆయన ఆశిస్తున్నట్టున్నారు.

అయితే అల్లు అర్జున్ చేసిన అతి కారణంగా.. ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే.. తనను కేసునుంచి మినహాయించాలని ఆయన ఎందుకు పలాయనం చిత్తగిస్తున్నారో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఆర్థిక సహాయం అందించినట్టు అర్జున్ ఆల్రెడీ ప్రకటించారు. సంధ్య థియేటర్ కు కుటుంబం సహా వెళ్లడం తనకు అలవాటు అని సమర్థించుకున్నారు. దానిని కూడా ఎవ్వరూ కాదనడం లేదు.

కానీ.. మాసం తిన్నాం అని ఎముకలు మెడలో వేసుకుని తిరిగినట్టుగా.. తన అలవాటు లేదా సెంటిమెంటు సంధ్య థియేటర్ కు వెళ్లడం అయితే.. ఆయన ఎంచక్కా వెళ్లవచ్చు. మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు? అనేది ప్రజల సందేహం.

జరిగిన ఘోరంలో అల్లు అర్జున్ పాత్ర, తప్పు కూడా ఖచ్చితంగా ఉంది. ఆ కేసులో ఆయన పేరు నిందితుడిగా ఉన్నంత మాత్రాన.. ఆయనకు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడదు. మహా అయితే జరిమానా పడుతుంది. చనిపోయిన మహిళ మరణాన్ని మాత్రమే కాదు.. రెండు రాష్ట్రాల్లో తమకోసం వెంపర్లాడే అభిమానుల ప్రేమను గౌరవించి అల్లు అర్జున్ ఆ జరిమానా కూడా కట్టాలి.

ఒకసారి ఇలాంటిది జరగడం వల్ల.. మరోసారి ఓపెన్ టాపు జీపుల్లో వెళ్లి జనాల్ని ఎగబడేలా చేయకుండా సెలబ్రిటీలు జాగ్రత్త పడతారు. ఇలాంటి పొరబాటు తాము చేయకూడదనే అవగాహన ఇతర నటులకు కూడా వస్తుంది. అల్లు అర్జున్ ను ఇప్పుడు కేసు నుంచి తప్పిస్తే.. సెలబ్రిటీలు ఇదేమాదిరిగా అనుచిత పద్ధతుల్లో ఎప్పటికీ రెచ్చిపోతూనే ఉంటారు.

ముందుగా ప్లాన్ చేసిన, ప్రకటించిన కార్యక్రమాలకు, ఆ ప్రకారం భద్రత ఏర్పాట్లు చేసిన కార్యక్రమాలకు ఓపెన్ టాపు వాహనాల్లో వెళ్లినా ఓకే. కానీ.. ఇలా ఏమాత్రం భద్రతలేని సినిమా థియేటర్ల వద్దకు వెళ్లి చావులకు కారణం కావడాన్ని గురించి అల్లు అర్జున్ నిజంగా పశ్చాత్తాపం ఫీలవుతున్నాడంటే.. ఆయన తన పిటిషన్ ఉపసంహరించుకుని కేసులో నిందితుడిగా ఉండాలి.

జరిమానాలు పడితే కట్టేసి లెంపలు వేసుకోవాలి. అప్పుడే ఆయన మనస్తాపాన్ని అభిమానులు నమ్ముతారు. లేకపోతే, పలాయన మంత్రం పఠించినంత వరకు అంతా నాటకం అనే అనుకుంటారు.

13 Replies to “బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?”

  1. శిల్పా గారినీ కూడా తనతో తీసుకుని వెళ్ళాడనే కృతజ్ఞత కూడా లేకుండా…కేవలం కళ్యాణ్ బాబాయ్ అన్నాడనే ఏకైక కారణం తో ఇలా టార్గెట్ చెయ్యడం ఎంత వరకు సమంజసం GA….చెప్పు….😂😂

  2. పొరపాటు గా బాబాయ్ కి థాంక్స్ చెబితే ఒక్కసారి పెన్ రివర్స్ తీసుకుంది. ఇంతలో ఎంత మార్పు. 😂

  3. Aayanem cheyyalo cheppadaniki meerevarayya. Chance unte meere justice ichhesela unnaru. Jarigindi tappe. Kaani adi unexpected. Yevaru kavalani chesindi kaadu. Mee media valla yenta mandi chanipoyaru. Yeppudaina sorry ayina cheppara? I am not supporting AA.

  4. This movie itself targeted one community as wrong doers. The wrong doers are from tdp, and also not from tdp. Why naming characters with a community name tag?

    nobody supports that…

    how it will be named bolli naidu instead of jali reddy

Comments are closed.