తెలుగు చలన చిత్ర రంగంలో చాలా మంది స్టార్ కుటుంబాలతో పోల్చేంతగా కాకపోయినప్పటికీ.. అంతే స్టార్ డమ్ హోదాను అనుభవిస్తున్న వారిలో ‘మంచు’ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంచు మోహన్ బాబు కుటుంబం.. తమ సినిమాలు, అవి సాధించే విజయాలతో కంటె.. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు దూకుడైన వైఖరి ఇందుకు ప్రధాన కారణం. తాను మనసులో ఏదీ పెట్టుకోకుండా ఉన్నదున్నట్టుగా మాట్లాడతానని, వ్యవహరిస్తానని అంతకు మించి మరేమీ లేదని ఆయన తన దూకుడుకు నిర్వచనం చెప్పుకుంటారు.
తాను క్రమశిక్షణకు మారుపేరు అని ఆయన చెప్పుకుంటారు.. షూటింగుల విషయంలో టైమ్ సెన్సు పాటించడంలో మోహన్ బాబు గురించి అందరూ అదే చెబుతారు. ఆ క్రమశిక్షణ తనకు ఎన్టీ రామారావు నుంచి అలవాటు అయిందని ఆయన చెప్పుకుంటారు. అది నిజమే కావొచ్చు. కానీ ఆయన ఆ క్రమశిక్షణను తన కొడుకులకు కేరీ ఫార్వర్డ్ చేయలేకపోయారు. దాని పర్యవసానమే.. ఇప్పుడు మంచు కుటుంబం ఈ స్థాయిలో బజార్న పడడం.
మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరూ భయపడతారు. కోపం వస్తే ఆయన చేయిచేసుకుంటాడనే భయం చాలా మందిలో ఉంది. అలాంటి ఉదాహరణలు కూడా అనేకం ఉన్నాయి. ప్రతి కోపానికీ ఆయన ఒక కారణం కూడా వివరిస్తుంటారు. అలాంటి మోహన్ బాబు.. తనను చిన్న కొడుకు మనోజ్ కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఇవాళ వచ్చింది. తండ్రి తనను కిరాయి మనుషులతో కొట్టించాడని, అదే చిన్న కొడుకు కూడా పోలీసులకు ఇంకో ఫిర్యాదు చేయడమూ జరిగింది. కొడుకు ఫిర్యాదు పర్యవసానంగా ఒక అరెస్టు కూడా జరిగింది. మంచు సోదరులు విష్ణు, మనోజ్ ఇప్పుడు వరుస ప్రెస్ మీట్లతో చెలరేగిపోతున్నారు.
క్రమశిక్షణ ఇదేనా?
తమ ఇల్లు తమ ప్రెవేటు ప్రాపర్టీ అని మంచు కుటుంబం అనుకోవడంలో తప్పులేదు. ఇంటి ప్రాంగణంలోకి ఎవరు వచ్చినా అది వారే నేరం చేసినట్టు అవుతుందని భావించడమూ కరక్టే. కానీ.. తమ ఇంట్లో ఒక గొడవ ఉన్నప్పుడు వారికి రక్షణ అవసరం అనిపిస్తే ఏం చేయాలి? గతంలో గన్ మెన్ల వైభవాన్ని కూడా అనుభవించిన మాజీ రాజ్యసభ సభ్యుడు కదా మోహన్ బాబు! ఆయనకు ఏం చేయాలో తెలియకుండా ఉంటుందా? తన ఇంట్లో ఒక గొడవ ఉన్నదని తెలిస్తే, రక్షణ కావాలని అనిపిస్తే పోలీసులను ఆశ్రయించి.. వారిద్వారా రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప.. ప్రెవేటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని ఇంటివద్దకు వచ్చిన వాళ్లను బౌన్సర్లతో కొట్టిస్తాం అంటే అదేం పద్ధతి.
మోహన్ బాబు ఇంటి వద్ద మంచు విష్ణు ఏర్పాటుచేసిన బౌన్సర్లు అని అంటున్నారు. అలాగని మనోజ్ తక్కువ తినలేదు. తను కూడా బౌన్సర్లను వెంటబెట్టుకుని తండ్రి ఇంటి మీదకు వెళ్లాడు. బౌన్సర్ల మధ్య యుద్ధంలాంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పాటుచేశారు. బౌన్సర్లు అనే పదం అందంగా కనిపించవచ్చు గానీ.. నాటుగా చెప్పుకోవాలంటే కిరాయిగూండాలు అనే అనాలి. తమకు ఏదైనా భయం ఉంటే, రక్షణ అవసరం అనిపిస్తే ఎవరికి వారు (విష్ణు, మనోజ్) ఇలా కిరాయి గూండాలను ఏర్పాటు చేసుకోవడమేనా పద్ధతి? ఇదేనా మోహన్ బాబు కొడుకులకు నేర్పిన క్రమశిక్షణ.
కమిషనర్ వార్నింగ్
మొత్తానికి పోలీసు కమిషనర్ మంచు సోదరులను విడివిడిగా పిలిపించి వార్నింగు ఇచ్చి పంపారు. నిజానికి ఈ వార్నింగు మోహన్ బాబుకు కూడా అంది ఉండాల్సిందే. ఈలోగా మీడియా మీద దాడి వ్యవహారం నుంచి తక్షణ ఉపశమనం కోసం తనకు కూడా గాయాలైనట్టుగా ఆయన ప్రెవేటు కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి, కోర్టు ద్వారా రక్షణ కవచం సిద్ధం చేసుకున్నారు. పోలీసులు అన్నదమ్ములకు ఇచ్చిన వార్నింగు కూడా అదే. మీ ఇంటి వ్వవహారం ఇంట్లో తేల్చుకోండి. చేతకాకపోతే పోలీసుల రక్షణ అడగండి. అంతే తప్ప.. మీరు మనుషుల్ని కిరాయికి మాట్లాడుకుని శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ఊరుకునేది లేదు అనే కమిషనర్ హెచ్చరించడం జరిగింది.
ఇలాంటి సమయంలో అసలు ఏం జరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
విద్యానికేతన్ సంగతులేంటి?
శ్రీవిద్యానికేతన్ అనేది మంచు మోహన్ బాబుకు డ్రీమ్ ప్రాజెక్టు అనే చెప్పాలి. అదేమాదిరిగా మంచు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు కూడా అదే. కమెడియన్, విలన్ వేషాలు వేస్తూ నిలదొక్కుకున్న మోహన్ బాబు ఒక స్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తరువాత.. తానే నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేసినా.. పరాజయాల రేటు చాలా ఎక్కువ. కొడుకులను ప్రొజెక్టు చేయడానికి చేసిన చాలా ప్రాజెక్టులు ఆయన నిర్మాణ సంస్థను కుదేలు చేసేశాయి. అయితే.. బంగారు గనిలాగా.. ప్రతి ఆర్థిక సంక్షోభం నుంచి మంచు కుటుంబాన్ని బయటపడేసినది ఆయన విద్యాసంస్థ శ్రీవిద్యానికేతన్ మాత్రమే. ఆ సంస్థ మీద మంచు మనోజ్ కూడా పెత్తనం కోరుకుంటున్నారు.
విద్యానికేతన్ పూర్తిగా మోహన్ బాబు సొంతం పెత్తనం మొత్తం ఆయనదే అని బాహ్యప్రపంచం అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ పరిస్థితి మారిపోయి చాలాకాలం అయింది. ఇప్పుడు శ్రీవిద్యానికేతన్ సామ్రాజ్యం దాదాపుగా వెరోనికా చేతుల్లోకి, అనగా ఇండైరక్టుగా మంచు విష్ణు చేతుల్లోకి, వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఇదంతా చాలా పద్ధతి ప్రకారం జరిగిపోయింది. మంచు మనోజ్ నిజానికి చాలా ఆలస్యంగా మేలుకున్నారు. విద్యానికేతన్ చేతులు మారుతున్న ప్రక్రియ అనేది రహస్యంగా ఏమీ జరగలేదు. అందరికీ తెలుసు. మనోజ్ కు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన అలా వదిన చేతుల్లోకి పెత్తనం వెళ్లడాన్ని సహించలేకపోతున్నారు. విద్యానికేతన్ మీద తాను కూడా పెత్తనం కోరుకుంటున్నారు. ఇంతకూ వెరోనికా చేతుల్లోకి యాజమాన్యం ఎలా వెళ్లింది?
అందుకు దారితీసిన మూలకారణాలు తెలియదు గానీ.. శ్రీవిద్యానికేతన్ కొంతకాలం కిందట ఆర్థిక సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సంస్థను మొత్తం అమ్మకానికి పెడుతున్నారనేంత ప్రచారం జరిగింది. రాజకీయాల నుంచి విరమించుకున్న చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ మంత్రి అయిన ఒక నాయకురాలు టోకుగా విద్యాసంస్థను కొనుక్కోవడానికి బేరం మాట్లాడినట్లుగా కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి. అమ్మకం అనే దుస్థితిని తప్పించుకునేలా, మొత్తానికి సంక్షోభం నుంచి బయటపడడానికి వెరోనికా తన తల్లిదండ్రుల ద్వారా పెట్టుబడులు సమకూర్చారు. అదే సమయంలోనే వినయ్ మహేశ్వరి అనే కొత్త పాత్ర కూడా శ్రీవిద్యానికేతన్ సామ్రాజ్యంలోకి ఎంటరైంది. అనధికారికంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి 400–500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. దాదాపుగా పెత్తనం మొత్తం వెరోనికా చేతుల్లోకి వెళ్లింది.
శ్రీవిద్యానికేతన్ నిర్వహణ వివిధ విభాగాలుగా మారింది. ఉదాహరణకు వేల మంది విద్యార్థులకు మూడుపూటల భోజనాలు, స్నాక్స్ అందించే స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. నిజానికి అది రికార్డుల పరంగా ఒక సెపరేట్ వ్యవస్థ. అది వినెటెక్నికా అనే పేరుతో ఉంటుంది. అది పూర్తిగా వెరోనికాకు సంబంధించిన వ్యాపారం. వెరోనికా చేతుల్లోకి విద్యానికేతన్ వ్యాపారం వెళ్లిన తర్వాత నిర్వహణలో చాలా మార్పులు జరిగాయి. కాలేజీ పెత్తనం మోహన్ బాబు చేతుల్లో ఉన్నప్పుడు.. అక్కడ కీలకంగా ఉన్న వ్యక్తులు మారారు. విద్యానికేతన్ పునాదుల్లో గోపాలరావు అనే ఆయన ఉండేవారు. ఆయన చాలాకాలం కిందటే వృద్ధాప్యం కారణంగా తప్పుకున్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా తులసినాయుడు చక్రం తిప్పుతూ వచ్చారు. పెత్తనం వెరోనికా చేతుల్లోకి మారిన తర్వాత తులసినాయుడును కూడా తప్పించారు.
అంతే కీలకమైన పోస్టులోకి వెరోనికా తరఫున ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి వినయ్ మహేశ్వరి! ఇప్పుడంతా విద్యానికేతన్ లో ఆయనదే హవా. వినయ్ మహేశ్వరి అంటే.. ఆయన పూర్వ రంగం మీడియా వ్యాపార నిర్వహణతో ముడిపడి ఉంది. ఆయన గతంలో దైనిక్ భాస్కర్ పత్రికా సంస్థలో పనిచేశారు. జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో సాక్షి మీడియా గ్రూపుకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, సీఈవోగా వచ్చారు. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం విద్యానికేతన్ లోకి వచ్చింది. విద్యాసంస్థల నిర్వహణలో ఆయనకు అనుభవం లేదు గానీ.. పెట్టుబడుల సమీకరణ, డబ్బులు పెట్టుబడులుగా మార్చడం లాంటి వ్యవహారాల్లో దిట్ట అంటుంటారు. విద్యానికేతన్ కు అవసరమైన పెట్టుబడులను సమీకరించడంలోనూ, బయటి నుంచి వస్తున్న ఫండ్స్ ను, అలాగే సంస్థలో లాభాలను షేర్ మార్కెట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలోనూ ఆయన మాట చెల్లుబాటు అవుతుందని అంటుంటారు.
అలాగే వెరోనికా ఆగమనం తర్వాత.. సమకూరిన భారీ నిధులతో విద్యానికేతన్ ప్రాంగణానికి వెలుపల కూడా కొన్ని పెద్ద పెద్ద స్టూడెంట్ హాస్టళ్లను నిర్మించారు. మరొకవైపు మంచు మనోజ్ ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నారు. విద్యానికేతన్ వ్యవహారాలు పూర్తిగా తమ చేతుల్లో లేకుండా మారిపోవడం ఆయనకు సహజంగానే మింగుడుపడలేదు. అయితే అక్కడ అధికారికంగా తాను చేయడానికి ఏమీ లేదు. కొంతకాలం కిందట మనోజ్ వచ్చి.. ప్రాంగణానికి వెలుపల ఉన్న హాస్టళ్లలో విద్యార్థులను కలిసి, వారికి అన్యాయం జరుగుతోందని, నిర్వహణ బాగాలేదని, వారికి అండగా తాను ఉంటానని చెప్పి రెచ్చగొట్టేలా మాట్లాడి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఇలాంటి అసంతృప్తులు, విబేదాలు అన్నీ చినికి చినికి గాలివానగా మారి ప్రస్తుత రచ్చల స్థాయికి రూపుదాల్చాయి. ఈ వివాదం తర్వాత మనోజ్ మాట్లాడుతూ ‘తనకు ఆస్తులు డబ్బులు వద్దని, విద్యానికేతన్ లో అక్రమాలు జరుగుతున్నాయని, వారికి న్యాయం చేయడం కోసమే తాను ప్రయత్నిస్తున్నానని, అవన్నీ నాన్న గారి దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నానని’ అనడం కూడా వ్యూహాత్మకమే. ఆయన వ్యూహం ఏంటి? ఎందుకలా అంటున్నారు?
మనోజ్ సాధించేది ఏమీ లేదు?
ఇప్పుడు రేగుతున్న వివాదం ద్వారా మంచు మనోజ్ సాధించేది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఆయనకు కొత్తగా జరిగే నష్టం కూడా లేదు. ఎందుకంటే.. మోహన్ బాబు ఇష్టంతో పని లేకుండా మౌనికను పెళ్లి చేసుకున్నప్పుడే.. ఆయనకు జరగగల నష్టం జరిగిపోయింది. మోహన్ బాబు ఆస్తులన్నీ ఆయన ఆడియో సందేశంలో చెప్పుకున్నట్టుగా, విష్ణు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఆయన స్వార్జితం. ఆ ఆస్తులను ముగ్గురు పిల్లల మధ్య ఎలా పంచి ఇవ్వాలనేది పూర్తిగా ఆయన ఇష్టం.
తనకు సమాన వాటాగానీ, ప్రయారిటీ వాటా గానీ పొందగల పరిస్థితిని మనోజ్ ఎప్పుడో కోల్పోయారు. అసలు వాటా వస్తుందో లేదో కూడా తెలియని స్థితిలోకి వచ్చారు. ఆ తెగింపు కారణంగానే.. తాజా రచ్చకు శ్రీకారం చుట్టారు.
ఈ వివాదం వలన మంచు మోహన్ బాబును బజార్లోకి లాగడం తప్ప మనోజ్ సాధించేది ఏమీ లేదు. ఇప్పటికే వివాదం రచ్చకెక్కిన తర్వాత.. సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్దవ్యక్తి, రాజకీయ రంగం నుంచి మరో పెద్ద వ్యక్తి జోక్యం చేసుకుని రాజీ కుదిర్చడానికి మాట్లాడుతున్నట్టుగా కొన్ని గుసగుసలు వినిపించాయి. మనోజ్ కు కావాల్సింది కూడా అదే. ఒకవేళ వివాదం యొక్క ప్రస్తుత తారస్థాయి వలన ఎవరైనా జోక్యం చేసుకుని రాజీ చర్చలు జరిపితే.. బహుశా తనకు ఏమైనా లాభం జరగవచ్చు. కాగా, ఈ వివాదం వలన తాను కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు. ఆ తెగింపుతోనే మనోజ్ ఇలా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన ప్రతి అడుగూ వ్యూహాత్మకంగానే సాగుతోంది. మోహన్ బాబు ఇంటి మీదకు వెళ్లడం కూడా దాడికి వెళ్లినట్టుగా బౌన్సర్లను వెంటబెట్టుకుని వెళ్లారు. బౌన్సర్లు మాత్రమే కాదు, మీడియాను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. మీడియాలో ప్రొజెక్షన్ అనుకూలంగా ఉంటుందనే నమ్మకంతోనే, కెమెరాల సాక్షిగా తలుపులు బద్దలు కొట్టి మరీ లోనికి వెళ్లారు. చివరికి ఆ సంఘటన ఇప్పుడు ఎంత పెద్దదిగా మారి, మోహన్ బాబును జర్నలిస్టులపై దాడి కేసులోకి ఇరికించిందో అందరికీ అర్థమవుతోంది.
ఇప్పుడు పోలీసులు కూడా మంచు సోదరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. వివాదం మరింతగా ముదిరే అవకాశం తక్కువ. ఇప్పటి దాకా జరిగిన దానికి సంబంధించి మంచు సోదరులకు కేసుల తలనొప్పి ఎంత ఉంటుందో తెలియదు గానీ.. జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబుకు చికాకులు తప్పవు. రెండు వారాలు గడిచేలోగా.. మొత్తం సద్దుమణిగిపోతుంది. వ్యాపారాలన్నీ ఇప్పటి మాదిరిగానే యధావిధిగా నడుస్తూ ఉంటాయి. కొత్తగా చేయడానికి ఇంకేం లేదని మంచు మనోజ్ కూడా ఒక క్లారిటీకి వచ్చి ఊరుకుంటారు.
ఈ సరికొత్త ‘మంచు తుపాను’ చిత్రంగా ఈ మంచుకాలంలోనే పూర్తిగా అణిగిపోతుంది.
Good write up
Industry ni kramashikshana pette prayatnam lo tana kutumbam kramashikshanani tyagam chesina tyagasheeli
Ambani family kuda ide kada..mukesh started working and involving more into bussiness from starting…anil emo koncham relax mode lo cinema valla chuttu njoy chesthu late ga bussiness enter ayaru..age wise kuda diff vuntadi kada..so ..dhanivala grip missing ani anil went away ..final ga edo set ayaru…so parents has to learn emo…more money vunapudu pedda vadiki konni ichesi, then chinna vadu age perige varaki chinna vadi bussiness lu parents chusukontu, then chinnodiki icjeyali….parents emo 1st kid handy aye sariki motham 1st kid ki icjesthqru…then pedda vadu emo adi nenu dev chesa so nade ekuva antadu…idi middile class lo kuda same
I think this is all because of vidyaniketan..
lots of block money…govt gives white money…
block nj white cheyadam easy…
okka deentlo ne intha money laundering jarigithe,
parayana pithyanya valla institutionals lo inka entha laundering undi…
just peruke non profit education institutions…lopala antha money laundering
TV9 ni M C Babu kottadam yenta mandi oppose chestatu ?
సామాన్య జనాలు ఎవరూ అపోజ్ చేయరు పైగా ఆ తన్నులు తిన్న అనామక జర్నలిస్టు ప్లేస్ లో యే దేవీ నాగవల్లి లాంటి వాళ్ళు ఉంది ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నారు
Why only snake valli !! why not Rajani kantam ?
Jagan invested in this and obviously he puts his people.
మొహన్ బాబు గారు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని TV9 రిపోర్టర్ కు త్త చెక్కేయడం ..
నిజమే ఈ విషయం మంచు తాతని ఎంత మెచ్చుకున్నా తక్కువే ,కాకపోతే ఎవరో ఆ అనామక జర్నలిస్టు ప్లేస్ లో యే దేవీ నాగవల్లి ఉండి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది మనకి