నితిన్.. కాలం కలిసి రావడం లేదు

నితిన్ ఎంచుకునే సబ్జెక్ట్ లు తేడా కొడుతున్నాయనిపిస్తుంది గ్రాఫ్ చూస్తుంటే, మంచి ఫ్యామిలీ, యూత్ ఫుల్ సినిమాలు చేస్తుంటే జనం చూస్తున్నారు.

నితిన్.. పక్కా ఫ్యామిలీ లవ్లీ హీరో. ఇష్క్, అ ఆ, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమాలు. కానీ 2024లో ఒక్క సినిమా లేదు, ఒక్క సినిమా విడుదల కాలేదు. 2023 చివరిలో విడుదలైన ఎక్స్ ట్రార్డినరీ మాన్ ఓ డిజాస్టర్. అంతకు ముందు కూడా 2021 నుంచి హిట్ లు అన్నవి లేవు. ఇలాంటి పరిస్థితిలో 2024లో అసలు సినిమానే విడుదల కాలేదు.

నిజానికి ఈ నెలాఖరులో క్రిస్మస్ కు రాబిన్ హుడ్ సినిమా విడుదల కావాల్సి వుంది. కానీ పుష్ప 2 ఉధృతి కారణంగా వస్తుందా? రాదా? అన్న పరిస్థితుల్లో చిక్కుకుంది. అది కనుక వస్తే 2024లో ఓ సినిమా వున్నట్లు. లేకుంటే లేనట్లు.

నితిన్ ఎంచుకునే సబ్జెక్ట్ లు తేడా కొడుతున్నాయనిపిస్తుంది గ్రాఫ్ చూస్తుంటే, మంచి ఫ్యామిలీ, యూత్ ఫుల్ సినిమాలు చేస్తుంటే జనం చూస్తున్నారు. కానీ అదే నితిన్ మాస్.. మాస్ అంటూ వెళ్తుంటే పక్కన పెడుతున్నారు.

రాబిన్ హుడ్ సినిమా కూడా మాస్ అనే లుక్ తోనే వస్తోంది మరి. ఎలా వుంటుందో చూడాలి. దర్శకుడు వెంకీ కుడుముల మీద నమ్మకం వుంది జనాలకు. దీని తరువాత వస్తున్న తమ్ముడు సినిమా కూడా ఫ్యామిలీ ప్లస్ మాస్. ఈ రెండూ వర్కవుట్ అయితే నితిన్ కు కాలం కలిసి వస్తుంది 2025లో. లేదంటే కష్టం అవుతుంది.

2 Replies to “నితిన్.. కాలం కలిసి రావడం లేదు”

Comments are closed.