యూత్‌ఫుల్, ఫ్యామిలీ హీరో శర్వానంద్. కానీ శర్వాకు 2024 పూర్తిగా నిరాశలోనే మిగిలింది. నిజానికి శర్వానంద్ చాలా కాలంగా ఫ్లాపులను ఎదుర్కొంటున్నారు. 2018 తరువాత శర్వానంద్ ఖాతాలో హిట్ అన్నది లేదు. అయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. కానీ హిట్‌లు మాత్రం పడడం లేదు.
2024లో శర్వానంద్ పరిస్థితి మరీ విచిత్రం. కేవలం ఒకే ఒక్క సినిమా విడుదలైంది. మనమే అనే ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. శర్వానంద్ లాంటి హీరో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలి. కానీ ఆ అవకాశం రాలేదు శర్వానంద్‌కు. 2025లో రెండు సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. ఒకటి ఇప్పటికే చాలా వరకు పూర్తయిన అనిల్ సుంకర నిర్మాణంలో సినిమా. మరోటి శర్వా హోమ్ బ్యానర్ లాంటి యువి నిర్మాణంలో సినిమా.
2025లో ఏదో విధంగా ఈ రెండు సినిమాలు వస్తాయి. కానీ రెండింటిలో ఒకటి అయినా పక్కాగా హిట్ అనిపించుకోవాలి. లేదంటే శర్వా కెరీర్ కే కష్టం అవుతుంది. మొత్తం మీద 2024లో జాతకం బాలేదు.. 2025లో కచ్చితంగా బాగుండాలి శర్వా జాతకం.