సినీ నటుడు మోహన్‌బాబుపై జర్నలిస్టులపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మొదట ఆయనపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్‌బాబు దాడిని జర్నలిస్టు సంఘాలు సీరియస్‌గా తీసుకున్నాయి. దీంతో ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లోతుగా విచారణ జరిపిన అనంతరం హత్యాయత్నం కేసు నమోదు చేయడం గమనార్హం.
మంచు కుటుంబ వివాదం వీధికెక్కిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ ఒక్కడు ఒకవైపు, మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు మరోవైపు అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం, మంచు సోదరులు వేర్వేరు సమయాల్లో వెళ్లిన సంగతి తెలిసిందే.
పోలీసుల నోటీసుపై మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుతానికి విచారణకు వెళ్లకుండా మినహాయింపు పొందారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైకోర్టు కూడా అది వారి కుటుంబ గొడవని, పరిష్కరించుకునేందుకు వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పింది. పోలీసులు, మీడియా అత్యుత్సాహం ప్రదర్శించొద్దని న్యాయ స్థానం పేర్కొంది. అయితే మోహన్‌బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
ఎవడి ఇంటిలో గొడవ అయిన మీడియా మాత్రం అందుకో కొంచం పెట్రోల్ పోసి మరి చలికాచుకుంటుంది