వైసీపీకి మాజీ మంత్రి అవంతి రాజీనామా

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి ఆయ‌న రాజీనామా చేశారు.

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి ఆయ‌న రాజీనామా చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఐదారు నెల‌ల‌కే వ్య‌తిరేకంగా పోరాటాలు చేయాలంటూ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ రాజీనామా చేస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. తాడేప‌ల్లిలో కూచుని జ‌గ‌న్ ఆదేశాలు ఇస్తుంటార‌ని, క్షేత్ర‌స్థాయిలో ఆచ‌రించ‌డం అంత సులువు కాద‌ని ఆయ‌న మీడియా స‌మావేశంలో పేర్కొన్నారు.

వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజీనామా చేస్తున్నాన‌ని, మీరు ఇచ్చిన అవ‌కాశానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ జ‌గ‌న్‌కు రాసిన రాజీనామా లేఖ‌లో ఆయ‌న పేర్కొన‌డం విశేషం. 2014-19 మ‌ధ్య ఈయ‌న టీడీపీ ఎంపీగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా చోటు ద‌క్కించుకున్నారు. అంత‌కు ముందు అవంతి ప్ర‌జారాజ్యం పార్టీలో కూడా ఉన్నారు. ఇదిలా వుండ‌గా వైసీపీ ఓడిపోవ‌డంతో ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌స్తుతానికి ఏ పార్టీలో చేరాల‌ని అనుకోవ‌డం లేద‌ని అవంతి అన్నారు. గ‌త ఐదేళ్ల‌లో రాజ‌కీయంగా బిజీగా వుంటూ, కుటుంబానికి త‌గిన స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయిన‌ట్టు చెప్పారు. కుటుంబానికి స‌మ‌యం కేటాయించాల‌ని అనుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

కూట‌మి స‌ర్కార్‌కు ఐదేళ్ల స‌మ‌యం ఇచ్చార‌ని, ఐదు నెల‌లు కూడా త‌మ పార్టీ స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డం న‌చ్చ‌లేద‌న్నారు. కూట‌మి స‌ర్కార్‌పై సానుకూల ధోర‌ణితో అవంతి మాట్లాడ్డం చూస్తే, భ‌విష్య‌త్‌లో జ‌న‌సేన‌, టీడీపీలో చేరే అవ‌కాశం వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎవ‌రినీ విమ‌ర్శించాల‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు.

11 Replies to “వైసీపీకి మాజీ మంత్రి అవంతి రాజీనామా”

  1. at the election time JAgan had 40% share of votes….

    now should have been gone up by 8 to 10% because of failure in fulfilling six assurances by TDP-Janasena govt

  2. జంపింగ్ జపాంగ్స్ అందరూ పోవాలి…

    నీఖార్సయినా వైసీపీ కార్యకర్తలు మిగలాలి ఇదే కదా జగనన్న కోరుకుంటున్నది….జై జ….

  3. చేయక ఏమి చేస్తాడు గంట అరగంట కార్యక్రమం కూడా నోచుకోలేదు వాడి బతుకు కి మంత్రి కూడా

    ఇప్పుడు వాడి పెళ్లం కూడా వాడికి ఓటు వేయడానికి ఆలోచన లో పడింది అని ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది vedhava కు

Comments are closed.