ఆ జ‌గ‌న్‌కు ఎవ‌రైనా చెప్పండ‌య్యా!

నీతి, నిజాయ‌తీకి తాను నిలువెత్తు నిద‌ర్శ‌నం అని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు.

నీతి, నిజాయ‌తీకి తాను నిలువెత్తు నిద‌ర్శ‌నం అని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెబుతున్నారు. త‌న గురించి తాను గొప్పలు చెప్పుకోవ‌డం కాదు, ప్ర‌జ‌లు, సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చెబితే గౌర‌వంగా వుంటుంది. అయినా ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో లేనివే అవైతే, వాటి గురించి ఎందుకు జ‌గ‌న్ ప‌దేప‌దే వ‌ల్లె వేస్తుంటారో ఎవ‌రికీ అర్థం కాని విష‌యం.

ప్ర‌సిద్ధ ర‌చ‌యిత కేఎన్‌వై ప‌తంజ‌లి చెప్పిన కొటేష‌న్‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుందాం. ముందుగా బ‌త‌క‌డం నేర్చుకో …ఆ త‌ర్వాత నీతిగా లేదా అవినీతిగా బ‌త‌కాలా? అనేది తేల్చుకోచ్చ‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఈ సూత్రాన్ని త‌న రాజ‌కీయ జీవిత ప‌ర్యంతం పాటించారు. అందుకే ఆయ‌న ద‌శాబ్దాలుగా త‌న ఉనికిని చాటుకుంటూ వ‌చ్చారు.

జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే… కొత్త భిక్ష‌గాడు పొద్దు ఎర‌గ‌డ‌నే సామెత చందాన వుంది. జ‌గ‌న్ నీతిగా వుంటే, వేల‌కోట్ల ప‌రిశ్ర‌మ‌లు, ఆస్తుల‌కు అధిప‌తి ఎలా అవుతారో ఆయ‌నే చెప్పాలి. జ‌గ‌న్ చెప్పేదొక‌టి, చేసేది మ‌రొక‌టి. బ‌హుశా తాను అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్నిక‌ల హామీల అమ‌ల్లో భాగంగా బ‌ట‌న్ నొక్క‌డాన్ని దృష్టిలో పెట్టుకుని నీతివంత‌మైన పాల‌న అందించాన‌ని అనుకుంటున్న‌ట్టున్నారు.

ప‌రిపాల‌న అంటే అదొక్క‌టే కాదు సామి, చాలా అంశాలు ముడిప‌డి వుంటాయ‌ని జ‌గ‌న్‌కు అర్థ‌మై కూడా, ఏమీ తెలియ‌న‌ట్టు స్వాతిముత్యంలో క‌మ‌ల్‌హ‌స‌న్ అంత‌టి అమాయ‌కంగా మాట్లాడుతుంటారు. అధికారంలోకి వ‌చ్చేందుకు ఏం చేయాలో, శ్రేణుల్లో ధైర్యం నింప‌డానికి ఎలాంటి మాట‌లు మాట్లాడాలో జ‌గ‌న్‌కు ఎవ‌రైనా చెబితే బాగుంటుందేమో!

త‌న హ‌యాంలో మ‌ద్యం, లిక్క‌ర్, ఇసుక‌ పాల‌సీలు ప్ర‌జ‌ల‌కు ఎందుకు కోపం తెప్పించాయో జ‌గ‌న్‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? ఎవ‌రి జేబులు నింప‌డానికి, ప్ర‌జ‌ల జేబులు కొట్టారో త‌న పాల‌న‌లోని కొన్ని పాల‌సీల గురించి జ‌గ‌న్ తెలుసుకుంటే మంచిది. అందుకే నీతి, నిజాయ‌తీ, విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త లాంటివి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌ని జ‌గ‌న్‌కు ఎవ‌రైనా చెప్పండ‌య్యా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వినేవాళ్ల‌కు బూతుమాట‌ల‌నిపిస్తున్నాయి.

ఎందుకంటే జ‌గ‌న్ పాల‌న‌లో ఎవ‌రికి? ఎంత‌మందికి న్యాయం జ‌రిగిందో అంద‌రికీ తెలుసు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు సీరియ‌స్‌గా ఆలోచిస్తే జ‌గ‌న్‌కే మంచిది. కాదు, కూడ‌దు తాను ప‌ట్టిన కుందేలికి మూడే కాళ్లు అంటే… చేయ‌గ‌లిగేదేమీ లేదని సొంత పార్టీ నాయ‌కులు సైతం అంటున్నారు.

12 Replies to “ఆ జ‌గ‌న్‌కు ఎవ‌రైనా చెప్పండ‌య్యా!”

  1. మద్యం, లిక్కరు అని రాసావు. రెండు ఒకటే కదా సామీ. ఆయన కి చెప్పేముందు మనం ఒక సారి చూసుకోవాలిగా. అసలే ఫస్ట్ టైమ్ కొంచెం ఘాటు గా రాస్తున్నాం. ఉంటా సామీ.

  2. డామిట్ కథ అడ్డం తిరిగింది. అయ్యా గ్యాస్ ఆంధ్ర నువ్వేంటి ఇలాంటి ఆర్టికల్ రాయడం ఏమిటి ? లేక నీకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయ్యిందా ? ఆయన లక్ష తప్పు చేసిన తప్పే చేయలేదని వాదించే వాడివి నువ్వేమిటి ఇలా ప్లేట్ తిప్పేశావు. సరే నీకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది అనుకుందాం దీన్ని ఇలాగే అనుసరించు. జీవితంలో బాగుపడతావు . వైసిపి ఇంతటి ఘోర పరాభవానికి కారణము నూటికి నూరుపాళ్ళు జగనే ఇక మిగిలిన వాళ్ళందరూ తలో ఒక చెయ్యి వేశారు అంతే. ఆయన అనుసరించిన విధానాలు మొండి పట్టుదల మూర్ఖత్వము నేను పట్టిన పుంజుటికి మూడే కాళ్లు అనే రకమ వేరశి వైసిపి ఘోర పరాభవం. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరూ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. మొన్న ఐదేళ్లు ప్రజలకు ఏం కావాలో అది ఆయన చేయలేకపోయాడు తాను ఏమనుకున్నాడో అది మాత్రమే చేశాడు. సరే ఆయన ఏదో ఇష్టపడి ఇస్తున్నాడని ప్రజలు పుచ్చుకున్నారు. 2019లో పసుమకు కుంకుమ కింద చంద్రబాబు గారు ప్రతి మహిళా అకౌంట్లో పదివేల రూపాయలు వేశాడు. అప్పుడు మన జగన్ 10000 తీసుకోండి ఓటు నాకు వేయండి అన్నాడు. ఇప్పుడు అతను ఇచ్చిన పథకాలు తీసుకున్నారు టిడిపి కి చేశారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని దారి చూపింది ఆయనే కాబట్టి ఆయన మాట ఆయనకే అప్పచెప్పారు ప్రజలు. అందరిలాగా ఆయన పరిపాలన సాగించి ఉంటే ఇంత ఘోర పరాభవం జరిగేది కాదు. ఆయన పాలనను గాలికి వదిలేసి పగ ప్రతీకారులతో రగిలిపోయాడు. ఇక ఈ ఐదు ఏళ్ళు ఆయన చేయని అరాచకం లేదు. ఎంత అరాచకం చేసి ప్రజలకు దూరం అవ్వాలో అంత అరాచకం చేసే ప్రజల నుంచి దూరం అయిపోయాడు. ఆయన చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలేదు చెప్పనివి నెరవేర్చలేదు. ఆయనను నవరత్నాలు ఇవ్వమని ఎవ్వడు అడగలేదు. అప్పనంగా ఇస్తున్నాడని ప్రజలు పుచ్చుకున్నారు. ఇంట జరిగినా జ్ఞానోదయం అయ్యిందా అంటే అవ్వలేదు అదే మూర్ఖత్వం అదే మొండి మొండి వాదన. వాడితోనే ఇంకా ప్రజలు నమ్మించాలని చూస్తున్నాడు.పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరికి అతను ఒక్కడే మిగలడేమో ? పరివర్తన చెందితే భవిష్యత్తు పరివర్తన చెందకపోతే భవిష్యత్తు మొత్తం శూన్యమే.

    .

Comments are closed.