వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన దాదాపు ఆరునెలల తర్వాత ప్రభుత్వంపై పోరాట ప్రణాళికతో ఉద్యమాలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీని మైండ్ గేమ్ ద్వారా దెబ్బ కొట్టడానికి, పార్టీ బలహీన పడుతున్నట్టుగా శ్రేణుల్లో ఒక అయోమయం సృష్టించడానికి తెలుగుదేశం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగమే.. ఒకేరోజు ఇద్దరు నాయకులు పార్టీని వీడిపోవడం.
విశాఖ పట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇద్దరూ కూడా వైసీపీని వీడుతున్నట్టుగా ప్రకటించి.. జగన్ పోరాటాలకు మద్దతు లేదనే భావన వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారి కుయుక్తులకు విరుగుడుగా తమ పోరాటాలు ఉండాలని వైసీపీ భావిస్తోంది.
నాయకులు పార్టీని వీడివెళ్లిన ఈ ప్రాంతాల్లోనే తమ ఉద్యమాలు, నిరసన పోరాటాలు మరింత గట్టిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పార్టీ శ్రేణులను పురమాయించినట్టుగా తెలుస్తోంది. ఆ నాయకులు కీలకంగా ఉన్న ప్రాంతాల్లో పోరాటాల్ని సక్సెస్ చేయడానికి స్పెషల్ ఫోకస్ పెట్టాలని జగన్ నిర్దేశించినట్టుగా తెలుస్తోంది.
అవంతి శ్రీనివాస్ ఎటూ చంద్రభజన చేయదలచుకున్నారనే సంగతి ఆయన ప్రెస్ మీట్ లోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దానికి తగినట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి. పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అయిదేళ్లదాకా వేచిచూడాలని ఆయన పీరియడ్ ప్రకటిస్తున్నారు. ఆరునెలలు పట్టించుకోకుండా వదిలేసి.. ఇన్నాళ్లుగా హామీలను పట్టించుకోని ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు జగన్ ను ఆయన తప్పు పడుతున్నారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పోరాట పథంలోకి తద్వారా రైట్ ట్రాక్ లోకి వచ్చారనేది ప్రజలు భావన. ఆయన ఇన్నాళ్లూ తనకు ప్రతిపక్ష నేత హోదాకోసం, తనకు సెక్యూరిటీ పెంపుకోసం కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గడిపారు. ఇప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ పోరాటాలకు సిద్ధం అవుతున్నారు.
వచ్చే నెల నుంచి జిల్లాల్లో పర్యటించనున్న జగన్మోహన్ రెడ్డి.. ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా ఖాతాలుండాలని, ఊర్లలో ఉండే సమస్యలను ఫోటో తీసి తమ తమ అకౌంట్లలో షేర్ చేయాలని సరైన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీని వీడే వారి కుయుక్తులు ఒక చిన్న అవాంతరం లాంటివి.
అందుకే.. పార్టీని వీడిపోయిన నాయకులు ఉండే ప్రాంతాల్లో తమ పోరాటాలను మరింత గట్టిగా చేయాలని, అవకాశవాద నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీ కేడర్ దృఢంగానే ఉన్నదనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని వైసీపీ తలపోస్తోంది.
ఘోరంగా ఓడిపోయిన ఆరు నెల్లకే పోరాటం అంటే ఎవడికి ఉంటది ఓపిక, ఇంట్రెస్ట్ ? అధికారం లో ఉన్నప్పుడు భజన బ్యాచ్ కి పదవులు ఇచ్చి ఇప్పుడు పోరాడదాము రండి అంటే ఎవడొస్తాడు..
..
ఏదన్నా చెప్తే కొంచం అన్నా నమ్మేట్టుగా రాయి సామి..
ప్రతిపక్షం లో ఉంటే నాయకులు కార్యకర్తలు అభిమానులు గుర్తుకు వస్తారు ఈయన కోసం పోరాటాలు చేయాలి..
అధికారం లో ఉన్నప్పుడు వీరు ఎవరితో పని ఉండదు..
అవంతి శ్రీనివాస్
గ్రంధి శ్రీనివాస్
ఆళ్ల నాని
సామినేని ఉదయభాను
బాలినేని శ్రీనివాసరెడ్డి
వాసిరెడ్డి పద్మ
బీద మస్తాన్
ఆర్ కృష్ణయ్య
మోపిదేవి వెంకట రమణ
కర్రి పద్మశ్రీ
బల్లి కల్యాణ చక్రవర్తి
పోతుల సునీత
..
అన్నయ్య..ఈ తొక్కలో పార్టీ ఎంతో అర్ధం కావట్లేదు తిప్పి కొడితే పంది మంది మిగిలారు. అందరినీ వేసేస్తే ఇంటికెళ్లిపోవచ్చు..
అవంతి శ్రీనివాస్
గ్రంధి శ్రీనివాస్
ఆళ్ల నాని
సామినేని ఉదయభాను
బాలినేని శ్రీనివాసరెడ్డి
వాసిరెడ్డి పద్మ
బీద మస్తాన్
ఆర్ కృష్ణయ్య
మోపిదేవి వెంకట రమణ
కర్రి పద్మశ్రీ
బల్లి కల్యాణ చక్రవర్తి
పోతుల సునీత
..
అన్నయ్య..ఈ తొక్కలో పార్టీ ఎంతో అర్ధం కావట్లేదు తిప్పి కొడితే పంది మంది మిగిలారు. అందరినీ వేసేస్తే ఇంటికెళ్లిపోవచ్చు..