భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని వారు చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ మేనేజిమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడడం అక్కడ జరగదు. కాంగ్రెస్ తరహాలో.. అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో.. పార్టీ మేనేజిమెంట్ నిర్ణయాలను విమర్శిస్తూ ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడడం, చెలరేగిపోవడం బిజెపిలో సాధారణంగా కనిపించదు. కానీ.. ఇప్పుడు ఆ పోకడ మారుతున్నదా అనే అనుమానం కలుగుతోంది.
బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టబెట్టిన తీరుపై ఏపీ బీజేపీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.
ఏపీ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడడడం అనైతికం అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. జగన్ వారిని ఎంతో నమ్మి.. వారికి రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెట్టారని, పార్టీ ఓడిపోయిన వెంటనే వారు పార్టీకి, ఎంపీ పదవులకు కూడా రాజీనామాలు చేయడం కరెక్టు కాదని ఆయన అంటున్నారు.
సాంకేతికంగా వారి రాజీనామాలు చేసి పార్టీ మారడం కరక్టే కానీ, అది నైతకం కాదు అని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. పైగా.. వారి స్థానంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉంటే.. అటువంటి నిర్ణయాలు తీసుకునే వాడిని కాదు అని కూడా రాజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఏదైతే అనైతికం అని విష్ణుకుమార్ రాజు అభివర్ణిస్తున్నారో.. ఆ అనైతిక చర్య ఆర్ కృష్ణయ్యకు వర్తిస్తుంది. భారతీయ జనతా పార్టీ అదే అనైతిక ఆర్ కృష్ణయ్యకు అగ్రపీఠం వేసింది. రాజీనామా చేసిన తర్వాత చాలా రోజుల పాటూ బిజెపిలో చేరాలా? కాంగ్రెసులోకి వెళ్లాలా? అనే మీమాంసలో ఊగిసలాడిన ఆర్.కృష్ణయ్య చివరికి కమలతీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పుకున్న గంటల వ్యవధిలోనే ఆయనకు ఎంపీ పదవి కట్టబెట్టేశారు… అది కూడా తెలంగాణ నాయకుడికి ఏపీ నుంచి పదవి ఇచ్చారు.
ఈ నిర్ణయంపై సహజంగానే ఏపీ బిజెపిలో అసంతృప్తులు ఉన్నాయి. అసలు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన వైనం మీదనే.. బిజెపి ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు నిప్పులు కక్కడం చూస్తోంటే.. అధిష్ఠానం నిర్ణయం పట్ల ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నట్టే ఉంది. అధిష్ఠానం సహిస్తుందా? లేదా వేచిచూడాలి.
ఈ లుకలుకలు ఆర్ కృష్ణయ్యకి వైసీపీ లో ఎంపి పోస్ట్ ఇచ్చినప్పుడు అస్సలు లేవా..??
లుకలుకలేమో గానీ, ఈయన వలన ఇదివరకు టీడీపీ, వైసీ””పీ* బావుకున్నదేమీ లేదు, సొంతం గా నాలుగు ఓట్లు తెచ్చుకోగలరో లేదో తెలియదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ లో కానీ, గత రెండేళ్ళ సభ్యుడిగా రాజ్యసభలో గాని ఈయన తమ ప్రాంతం కోసమో, వర్గం కోసమో మాట్లాడినట్లు గుర్తులేదు. వీరిని చేర్చుకుని బీజేపీ ఏమి సాధిద్దామనుకుంటుందో ఆ గుజరాతీ ద్వయానికే ఎరుక.