కిరణ్ అబ్బవరం..దిల్ రుబా

ప్రస్తుతానికి కె10 అని అంటున్న ఈ సినిమాకు దిల్ రుబా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

క సినిమా హిట్ తరువాత కె ర్యాంప్ అనే సినిమా ఒకె చేసాడు కిరణ్ అబ్బవరం. కానీ ఆ సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. అది చాలా మంచి సబ్జెక్ట్ కూడా. అయితే సాధారణంగా ఓ సినిమా సక్సెస్ అయితే దానిని క్యాష్ చేసుకోవాలని ఏ నిర్మాత అయినా అనుకుంటారు, అది సహజం కూడా. కిరణ్ తో గతంలోనే స్టార్ట్ చేసిన సినిమా ఒకటి వుంది. అది సెట్ మీద వుంది. దాన్ని ఇప్పుడు చకచకా పూర్తి చేసి విడుదల చేసే పనిలో వున్నారు.

ఆ సినిమా టైటిల్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి కె10 అని అంటున్న ఈ సినిమాకు దిల్ రుబా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ పరంగా చాలా బాగుంది. కథ కు ఏ మేరకు యాప్ట్ అవుతుందన్నది త్వరలో యూనిట్ ద్వారా తెలుస్తుంది. సాధారణంగా కిరణ్ అబ్బవరం మంచి సబ్జెక్ట్ లు ఎంచుకుంటారు. అందువల్ల ఈ సబ్జెక్ట్ కూడా డిఫరెంట్ గా వుంటుందని అనుకుందాం. దిల్ రుబా అని టైటిల్ పెట్టారు కనుక కచ్చితంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయి వుండొచ్చేమో.

ఈ సినిమా టైటిల్ మరో రెండు రోజుల్లో అఫీషియల్ గా ప్రకటిస్తారు. అక్కడి నుంచి ప్రమోషన్లు షురూ చేస్తారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదల అవుతుంది.