శేఖర్ కమ్ముల ఛేజింగ్ లు!

ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నా శేఖర్ కమ్ముల టచ్ మిస్ కాకూడదు. ఎందుకంటే ఆయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది

దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే గోదావరి గలగల… యూత్ స్వీట్ నథింగ్స్… ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. కానీ ఇప్పుడు చేస్తున్న కుబేర సినిమా అలా కాదట. పక్కా యూత్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అలా అని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మాత్రమే వుంటుందని కాదు.

సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తయారవుతుంది. కానీ ఇందులో యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగ్‌లు కూడా వుంటాయట. ఈ ఛేజింగ్ ఎపిసోడ్లు ముంబై రోడ్ల మీద చాలా వ్యయప్రయాసలు భరించి చిత్రీకరించారని తెలుస్తోంది.

సినిమా నుంచి ఇప్పటి వరకు క్యారెక్టర్స్ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఈ లుక్కుల ప్రకారం హీరో ధనుష్ చాలా సాదాసీదా మనిషిగా కనిపిస్తున్నాడు. సినిమా టైటిల్ చూస్తే కుబేర అని వుంది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఛేజింగ్‌లు వున్నాయని తెలుస్తోంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని లెక్కలు కడితే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి ఓ డిఫరెంట్ సినిమా అందించే పనిలో పడినట్లు తెలుస్తోంది.

ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నా శేఖర్ కమ్ముల టచ్ మిస్ కాకూడదు. ఎందుకంటే ఆయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది. వాళ్లంతా సినిమా చూసి షాక్ అవ్వకూడదు. డిసప్పాయింట్ అసలే అవ్వకూడదు. ఈ విషయం మనకన్నా శేఖర్ కమ్ములకే ఎక్కువ తెలుసు. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

2 Replies to “శేఖర్ కమ్ముల ఛేజింగ్ లు!”

Comments are closed.