ఎక్స్ క్లూజివ్ – గరివిడి లక్ష్మి

గరివిడి లక్ష్మి టైటిల్‌తో సినిమా వస్తోంది. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. 22న ఈ సినిమాకు ఆదోనీలో శ్రీకారం చుడుతోంది.

గరివిడి లక్ష్మి. ఈ పేరు ఉత్తరాంధ్ర జనాలకు బాగా, అంటే బాగా పరిచయం. గరివిడి లక్ష్మి బుర్రకథ అంటే ఉత్తరాంధ్ర జనాలకు ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ రోజు రాత్రి గరివిడి లక్ష్మి బుర్రకథ ఉంటుందంటే, మధ్యాహ్నం నుంచే ప్రిపేర్ అయిపోయేవారు.

అలాంటి గరివిడి లక్ష్మి టైటిల్‌తో సినిమా వస్తోంది. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. 22న ఈ సినిమాకు ఆదోనీలో శ్రీకారం చుడుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తారు.

ఇంతకీ టైటిల్ మాత్రమే వాడుతున్నారా, లేక గరివిడి లక్ష్మికి సంబంధించిన పాయింట్ ఏమైనా తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. గరివిడి లక్ష్మి బుర్రకథలు అంటే కాస్త డబుల్ మీనింగ్ మాటలతో ఉండేవి. కుర్రకారు, మాస్ జనాలు అంతా ఆ డబుల్ మీనింగ్ మాటల కోసమే పరుగులు పెట్టేవారు.

మరి ఈ సినిమా కథేంటో, గరివిడి లక్ష్మి బుర్రకథ ఆ సినిమాలో ఉంటుందో, ఉండదో, పాత్ర ఉంటుందో, ఉండదో అన్నీ మును ముందు తెలుస్తాయి.