సీఎం ఆదేశాలు.. అల్లు అర్జున్‌పై ఎవ‌రూ మాట్లాడ‌కండి!

సంధ్య‌ థియేట‌ర్ తొక్కిసలాట ఘ‌ట‌న vs అల్లుఅర్జున్ కాస్తా తెలంగాణ ప్రభుత్వం vs సినిమా పరిశ్రమ అనిపించేలా మారింది.

సంధ్య‌ థియేట‌ర్ తొక్కిసలాట ఘ‌ట‌న vs అల్లుఅర్జున్ కాస్తా తెలంగాణ ప్రభుత్వం vs సినిమా పరిశ్రమ అనిపించేలా మారింది. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అల్లుఅర్జున్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సీఎం సూచ‌న‌ల‌తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చట్టం తన పని తాను చేసుకుంటుందని ఇకపై ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానంగా తాను బన్నీ (అల్లుఅర్జున్) పై వ్యాఖ్యలు చేశానని సీఎం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లుఅర్జున్ అరెస్ట్ అనంతరం, మొదటి రోజు సినిమా ప్రముఖుల పరామర్శల వ‌ర‌కు అంతగా సైలెంట్‌గా ఉన్నా, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై గంటకు పైగా మాట్లాడటంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

రేవంత్ వ్యాఖ్యలకు అదే రోజు సాయంత్రం అల్లుఅర్జున్ ప్రెస్ మీట్ పెట్టి, తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఈ ఘటన కేవలం యాక్సిడెంట్ అని స్పష్టంచేశారు. మరుసటి రోజు పోలీసులు మీడియా ముందుకు రావడం ఒక ఎత్తైతే, సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సినిమా పరిశ్రమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మరో వివాదానికి దారితీసింది.

దీంతో, ఈ వివాదం ప్రభుత్వం vs. సినిమా పరిశ్రమగా మలుపు తీసుకుంది. అంతేకాక, బీజేపీ నాయకులు అల్లుఅర్జున్, సినిమా పరిశ్రమకు మద్దతు ప్రకటించడంతో పాటు, జాతీయ మీడియా కూడా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయాలను మరింత రగిల్చింది. ఈ పరిస్థితిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇలాంటి వివాదాలకు పార్టీ నాయకులు దూరంగా ఉండాలని సూచించినట్లు భావిస్తున్నారు.

కాగా, నిన్న సాయంత్రం పోలీసులు అల్లుఅర్జున్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇవాళ‌ ఉ.11గంటలకు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసుల ఎదుట విచారణకు అల్లుఅర్జున్ హాజరయ్యే అవ‌కాశం ఉంది. దీంతో, ఈ కేసు ఏ మలుపు తిప్పుతుందో సినీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

 

5 Replies to “సీఎం ఆదేశాలు.. అల్లు అర్జున్‌పై ఎవ‌రూ మాట్లాడ‌కండి!”

  1. ‘దమ్ము దైర్యం అంటే మా వోదోడిదే

    మా single సింహం.. మెగా స్టార్ and

    సూపర్ స్టార్ల కే ‘ఉచ్చ.. ‘ఉచ్చ పోయించి చేతులు కట్టుకుని, వొంగి వొంగి దండాలు పెట్టేలా చేసాడు.. అదీ ప్యాలెస్ పవర్ అంటే

  2. ఇందులో target ఏముంది. As a CM ga లేదంటే asA ts govt గా వాళ్ళ govt activities మీద నోరు పడేసుకునే వాళ్లకు దానికి తగ్గట్టే సమాధానం చెప్పటం వాళ్ళు చేస్తున్న పని. చెతనైనా govt ఎవరైనా ఇలాగే చేస్తారు.. చేతులు ముడుచుకుని కూర్చోరు. Ysr ruling inthakante double triple ruled గా ఉండేది

Comments are closed.