4 గంటలు.. ఊహించని ప్రశ్నలు

20 ప్రశ్నలు, దానికి అనుబంధ ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినప్పటికీ.. ప్రధానంగా 2 అంశాలపై పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

మూడున్నర గంటలు కూర్చొని పుష్ప-2 సినిమా చూడ్డానికి బాగుంటుంది. ఎందుకంటే, వినోదం ఉంది కాబట్టి. అదే 4 గంటలు ఓ విచారణలో కూర్చుంటే మామూలుగా ఉండదు. ఆ అనుభవం ఎలా ఉంటుందో తొలిసారి చవిచూశాడు అల్లు అర్జున్ అలియాస్ పుష్పరాజ్.

సంధ్య థియేటర్ ఘటనలో ఏ-11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్, ఈరోజు ఉదయం పోలీసుల విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. దాదాపు 4 గంటల పాటు నిందితుడు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. 20 ప్రశ్నలు, దానికి అనుబంధ ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినప్పటికీ.. ప్రధానంగా 2 అంశాలపై పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్ పెక్టర్ రాజునాయక్, నిందితుడు అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. వీళ్ల ప్రశ్నలన్నీ ప్రధానంగా 2 అంశాలపై తిరిగాయి. వీటిలో ఒకటి, అల్లు అర్జున్ కు రేవతి మృతి విషయం ఎప్పుడు తెలిసింది? థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడే రేవతి మృతి గురించి పోలీసులు చెప్పారా లేదా? ఈ దిశగా అల్లు అర్జున్ పై ప్రశ్నలు కురిపించారు పోలీసులు.

ఇక రెండో ప్రధానమైన అంశం విషయానికొస్తే.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నిందితుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తన క్యారెక్టర్ ను కించపరిచారని, వ్యక్తిత్వ హననం చేశారని అన్నాడు. అలా ఎందుకు అనాల్సి వచ్చింది? దానికి దారితీసిన కారణాలేంటి? ఎవర్ని టార్గెట్ చేస్తూ మీరు ఆ మాటలన్నారు అంటూ ప్రశ్నించారు. లాయర్ల సూచన మేరకు చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.

ఇక కీలకమైన వీడియోల ప్రదర్శన కూడా విచారణ సందర్భంగా జరిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ర్యాలీకి సంబంధించిన వీడియోల్ని చూపించి, కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. వాటిపై బన్నీ గతంలో చెప్పిన సమాధానాలే చెప్పాడట. అయితే సాక్ష్యాలతో పాటు కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో బన్నీ షాక్ అయినట్టు సమాచారం.

విచారణ కోసం పోలీస్ స్టేషన్ లోనే ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు. దాంట్లోకి ఎవరు రావాలనే నిబంధనల్ని కూడా పోలీసులు ముందుగానే పెట్టుకున్నారు. ప్రశ్నావళి కూడా కొంతమంది కనుకన్నల్లో మాత్రమే రూపొందింది. నిందితుడు, అతడితో వచ్చిన లాయర్ల కోసం మంచి నీళ్లు, భోజనం ఏర్పాటుచేశారు. కానీ అల్లు అర్జున్ భోజనం చేయలేదు. విచారణ ముగించుకొని తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. విచారణ మధ్యలో కొన్నిసార్లు నీళ్లు తాగాడు, కొన్ని స్నాక్స్ తిన్నాడు. అవి కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నవే.

18 Replies to “4 గంటలు.. ఊహించని ప్రశ్నలు”

  1. తీట అణిగింది, సమాజంలో ఉన్నప్పుడు ఒంటి మీద స్పృహ ఉండాలనే నీతి ప్రతి వ్యక్తి కి తెలిసేలా జరిగింది.

  2. సినిమా హీరో గారు తను వచ్చిన ఆదాయంలో టెన్ పర్సెంట్ ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబానికి రక్షణగా బాధ్యతగా ఉండాలని మా డిమాండ్తె లియజేస్తున్నాము

  3. అల్లు అర్జున్ మే 11 న నంద్యాల వెళ్ళాడు.

    సంధ్య లో ఘటన 11 కి జరిగింది.

    అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు..

    మళ్ళీ ఉదయం 11 గం..కి రమ్మని నోటీసులు ఇచ్చారు..

    నీ వెనక 11 అనే దరిద్రం ఉంది 🤣😂🤦‍️..

    అది పొతే గాని నువ్వు గట్టెక్కవ్ 👍

    #Jagangot11seats

  4. ఆ పోలీసుఉన్నతాధికా రీ పేరు కూడా షేకవత్ కావడం ఏదో దేముడు రాసిన స్క్రిప్ట్ లాగ వుందా?

    లేక రేవంత్ గారే కావాలి అని ఆ పోలీసు నీ ఆ టీం లో పెట్టారా?

Comments are closed.