రేపు విచారణ.. ఈరోజు మీడియా ముందుకు!

సుప్రీంకోర్టులో మోహన్ బాబు కేసు రేపు విచారణకు రానుండగా, ఈరోజు ఆయన మీడియా ముందుకు రావడం ఆసక్తి రేకెత్తించింది.

జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ ఆమధ్య కథనాలొచ్చాయి. అల్లు అర్జున్ ఇష్యూ హైలెట్ అవ్వడంతో మోహన్ బాబు వివాదం నుంచి మీడియా కాస్త పక్కకు తప్పుకుంది. అప్పట్నుంచి బయటకురాని మోహన్ బాబు ఈరోజు ఉన్నఫలంగా ప్రత్యక్షమయ్యారు.

తన యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు జరగ్గా అందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. “గతం గతః, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించనంటూ” డైలాగ్ చెప్పారు.

సుప్రీంకోర్టులో మోహన్ బాబు కేసు రేపు విచారణకు రానుండగా, ఈరోజు ఆయన మీడియా ముందుకు రావడం ఆసక్తి రేకెత్తించింది. ఆయన కేసు గురించి ఏం మాట్లాడలేదు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

ఆయన దగ్గరకు వెళ్లే ముందు మీడియా జనం “మైకుల్ని గట్టిగా పట్టుకోండి, లేదంటే మోహన్ బాబు లాక్కుంటారు” అంటూ జోకులు వేసుకున్నారు.

మోహన్ బాబుకు, మంచు మనోజ్ కు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. ఒక దశలో మోహన్ బాబు లైసెన్స్డ్ రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో తనను ప్రశ్నించడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్ లాక్కొని, అతడిపైనే దాడిచేశారు మోహన్ బాబు. దీనికి సంబంధించి నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అంతలోనే మోహన్ బాబు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.

4 Replies to “రేపు విచారణ.. ఈరోజు మీడియా ముందుకు!”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… కాల్ బాయ్ వర్క్

  2. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి వర్క్

Comments are closed.