జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు ఎట్టకేలకు ఊరట దొరికింది. తదుపరి విచారణ జరిగేంత వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసుల్ని ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం. విచారణను 4 వారాలు వాయిదా వేస్తూ, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. మోహన్ బాబు తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. దీంతో ఏకీభవించిన కోర్టు, మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
గత నెలలో మంచు కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయి. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు బాహాటంగానే విమర్శలు చేసుకున్నారు. తనకు తీరని అన్యాయం జరిగిందని, పట్టించుకోవడం లేదని మంచు మనోజ్ ఆరోపించగా.. కన్నకొడుకును తాగుబోతుగా చిత్రీకరిస్తూ ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు.
ఒక దశలో తండ్రికొడుకులంతా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. విషయం మరింత వివాదాస్పదం కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా మోహన్ బాబు దగ్గరున్న లైసెన్స్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వయంగా పోలీస్ బాసులు మంచు మనోజ్, విష్ణు పిలిచి మాట్లాడారు. సున్నితంగా హెచ్చరించి పంపించారు.
అంతకంటే ముందు మోహన్ బాబు నివాసం వద్ద ఇటు మంచు మనోజ్ బౌన్సర్లు, అటు మంచు విష్ణు ఏర్పాటుచేసిన బౌన్సర్లు కొట్టుకున్నారు. ఒక దశలో మంచు మనోజ్ చొక్కా చించే వరకు వెళ్లింది పరిస్థితి. ఈ క్రమంలో మీడియా అక్కడ గుమిగూడగా.. వాళ్లను చూసి మోహన్ బాబు కోపం కట్టలుతెంచుకుంది.
ఓ మీడియా ప్రతినిధి మైక్ ను లాక్కొని, అదే మైక్ తో తిరిగి అదే జర్నలిస్ట్ పై దాడిచేశారు మోహన్ బాబు. ఆ ఘటన రికార్డ్ అవ్వకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో. మీడియా మొత్తం దాన్ని షూట్ చేసింది, దీంతో మోహన్ బాబుకు పాలుపోలేదు. ఫలితంగా హత్యాయత్నం కేసు నమోదైంది.
తన ఫ్యామిలీ సమస్యలకు తోడు, ఇప్పుడీ కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే హాస్పిటల్ కు వెళ్లి బాధితుడ్ని పరామర్శించి, భేషరతుగా క్షమాపణలు కూడా చెప్పిన మోహన్ బాబు, సుప్రీంకోర్టుకు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. క్షణికావేశంలో అలా జరిగిపోయిందని, బాధితుడ్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని కోర్టుకు విన్నవించారు.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
What is code language.. vijayawasa call money sex scandal