భ‌క్తుల కంటే ష‌ర్మిల‌కు బాబే ముఖ్య‌మా?

ష‌ర్మిల‌, చింతా మోహ‌న్‌కు తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల కంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడే ముఖ్య‌మా?

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌తో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహ‌న్‌కు తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల కంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడే ముఖ్య‌మా? అని జ‌నాలు నిల‌దీస్తున్నారు. తిరుప‌తిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి టోకెన్లు పొందేందుకు క్యూల‌లో నిలిచి, తొక్కిస‌లాట‌లో కొంద‌రు ప్రాణాలు కోల్పోవ‌డం, మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఈ దుర్ఘ‌ట‌న‌పై ష‌ర్మిల చాలా మొక్కుబ‌డిగా స్పందించ‌డం, అలాగే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ చింతా మోహ‌న్ టీటీడీకి వంత పాడ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. మొద‌ట చింతా మోహ‌న్ స్పంద‌న ఏంటో తెలుసుకుందాం.

“దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా క్యూలో నిలబడ్డారు. దీంతో శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గి వాళ్లంతట వాళ్లే కింద పడి చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం క‌నిపించ‌డం లేదు. టీటీడీ అధికారుల పనితీరు భేష్‌. టీటీడీ అధికారులను అభినందిస్తున్నా” అని చింతా మోహ‌న్ పేర్కొన్నారు.

ద‌ర్శ‌నం టికెట్ల కోసం ఇంత దిగ‌జారాలా? అని చింతా మోహ‌న్‌పై బాధితులు విరుచుకుప‌డుతున్నారు. ఇలాంటి నాయ‌కుల వ‌ల్లే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో శాశ్వ‌తంగా జ‌నం దూర‌మ‌య్యార‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. ఇక ష‌ర్మిల స్పంద‌న చూస్తే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌నే తాప‌త్ర‌యం క‌నిపిస్తుంది. తొక్కిస‌లాట‌లో ఆరుగురు భ‌క్తులు చ‌నిపోవ‌డం అత్యంత విషాద‌క‌ర‌మ‌ని ఆమె తెలిపారు.

తొక్కిస‌లాట‌కు పాల‌న వ్య‌వ‌స్థ‌లో నిర్వ‌హ‌ణ లోపాలే అని విమ‌ర్శించ‌డం త‌ప్ప‌, చంద్ర‌బాబు స‌ర్కార్‌, టీటీడీపై అన‌డానికి ఆమెకు మ‌న‌సు రాలేదు. అందుకే ష‌ర్మిల పోస్టుపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, కామెంట్స్ పెట్ట‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇంకా న‌యం, దీనికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మంటార‌ని అనుకున్నాం…అన‌లేదు అని ష‌ర్మిల‌ను దెప్పి పొడిచారు. ఇంత పెద్ద దుర్ఘ‌ట‌న జ‌రిగితే, ఇదేనా మీ స్పంద‌న? ఇదే జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగి వుంటే, అబ్బో త‌ల‌చుకుంటేనే భ‌య‌మేస్తోంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

11 Replies to “భ‌క్తుల కంటే ష‌ర్మిల‌కు బాబే ముఖ్య‌మా?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. పాలనా వ్యవస్థ అంటే టీటీడీ అనే కదా .. నీకు అర్ధం కాకపోతే అది తప్పు అనమాట ..

      1. కామెంట్స్ లో ghee ghee అని తెగ ఇది అయిపోతున్నావు ..అంటే ఆ ఎపిసోడ్ లో అన్న కి బాగా బొక్క పడిందని నీ బాధా ?

  3. శవాల పార్టీ కి శవం దొరికింది వైజాగ్ లో కూటమి తెచ్చిన పెట్టుబడులు అంశం ప్రజల ద్రుష్టి మరల్చటానికి చనిపోయిన వాళ్ళను వాడుకోవటాన్ని చూస్తే అసహ్యమేస్తుంది అందులో ఏమైనా కుట్ర ఉంటే చూడాలి ఉంటే శిక్షించాలి దర్యాప్తు తక్షణం వేగం గ జరగాలి వివేకా గారి హత్య కేసు లాగా జరగకూడదు

Comments are closed.