ఆశలు పదిలం అంటున్న బీజేపీ మాజీ ఎంపీ

రానున్న కాలంలో ఇక్కడ నుంచే తన రాజకీయాలను పూర్తి స్థాయిలో మళ్లీ కొనసాగిస్తారు అని అంటున్నారు.

బీజేపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని 2024 ఎన్నికల్లో చూశారు. అయితే పొత్తులలో ఆయనకు సీటు దక్కలేదు. పైగా అనకాపల్లి లోక్ సభ ఎంపీ సీటుని కడపకు నుంచి వచ్చిన సీఎం రమేష్ తీసుకెళ్ళిపోయారు. ఇపుడు విశాఖ జిల్లాలో ఆయన హవాయే సాగుతోంది.

వచ్చే కాలం మంచిది అని భావిస్తూ జీవీఎల్ లాంటి వారు ఉన్నారు. జీవీఎల్ అయితే గత ఏడాది ఎంపీగా ఉంటూ సంక్రాంతి సంబరాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. అయితే అదంతా ఆయన ఎంపీ సీటు కోసం చేసే ప్రయత్నం అని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఈ ఏడాది కూడా జీవీఎల్ సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ద్వారా తన పంధాను కొనసాగిస్తున్నారు. ద్వితీయ విఘ్నం ఉండకూడదని ఆయన వేడుకలను ఘనంగా చేస్తున్నారు అంటున్నారు.

ఎన్నికలు రాజకీయాల కోసం ఆయన చేశారు అన్నది కాదని చెప్పేందుకు ఈ విధానం ఆయన కొనసాగిస్తున్నారు అంటున్నారు. అయితే మార్చి తరువాత సెప్టెంబర్ విద్యార్ధులకు ఉన్నట్లుగా రాజకీయ నాయకులకు ఒక ఎన్నిక తరువాత మరో ఎన్నిక ఉంటుంది. దాంతో జీవీఎల్ ఆశలన్నీ 2029 మీద ఉన్నాయని అంటున్నారు. ఆయన అలా తన విశాఖ మీద తన ఆశలను పదిలం చేసుకున్నారు అని అంటున్నారు.

జీవీఎల్ విశాఖలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన రానున్న కాలంలో ఇక్కడ నుంచే తన రాజకీయాలను పూర్తి స్థాయిలో మళ్లీ కొనసాగిస్తారు అని అంటున్నారు.

5 Replies to “ఆశలు పదిలం అంటున్న బీజేపీ మాజీ ఎంపీ”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.