రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ పతాకంపై శైలేష్ సన్ని, జ్ఞానేశ్వరి కండ్రేగుల జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం “మిస్టర్ & మిస్”రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 29న విడుదలవుతున్న* సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ ను మధుర శ్రీధర్ గారి చేతుల మీదుగా విడుదల చేయించారు. అనంతరం*
మధుర శ్రీధర్ మాట్లాడుతూ ..నాకు ఇష్టమైన దర్శకుల్లో అశోక్ ఒకరు.చాలా కష్టపడతాడు. “ఓ స్త్రీ రేపు రా” అనే సినిమా తీశాడు. తను హిందీలో కూడా ఆ కాన్సెప్ట్‌ను తీసుకోవడం జరిగింది.ఎప్పుడూ తను కొత్త కాన్సెప్ట్ తో వస్తుంటాడు.అలా వచ్చిన కొత్త కాన్సెప్టే ఈ “మిస్టర్ అండ్ మిస్”.ఈ సినిమాను ఓ.టి.టి.లో విడుదల చేయమని ఎన్నిసార్లు చెప్పినా అశోక్ వినలేదు.ఈ సినిమాను డైరెక్ట్ గా సినిమా థియేటర్ లోనే విడుదల చెయ్యాలనే పట్టుదలతో.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు.
కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన “ఆర్ ఎక్స్100” సినిమా లా ఈ మూవీ అనిపిస్తుంది.అశోక్ మనసుని అర్థం చేసుకొని యూనిట్ అందరూ బ్రిలియంట్ వర్క్ చేశారు .యశ్వంత్ నాగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకు అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.కాబట్టి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.ఈ నెల 29న థియేటర్లో విడుదల చేస్తున్న ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను.టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు
దర్శకుడు అశోక్ మాట్లాడుతూ …” మిస్టర్ అండ్ మిస్” బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.ఒక జంట సెల్ఫీ రొమాంటిక్ వీడియోను ఇష్టపడి తీసుకుంటే ఆ వీడియో వారి చేతులు దాటి మూడవ వ్యక్తికి చేరితే ఎలా ఉంటుంది .వాళ్లు హై లో ఉన్నప్పుడు తీసుకున్న ఈ వీడియో సొసైటీ కి చేరినపుడు వారి పేరెంట్స్ ఎలా స్త్రగుల్ అవుతారు, వాళ్ల రిలేటివ్స్ ఎలా ఫీలవుతారు, వీళ్లు ఎలా ఫేస్ చేశారు అనేది ఈ కథ. దీనికి ఒక మంచి లవ్ స్టోరీ జతచేసి తీయడం జరిగింది.
ఈ సినిమా ట్రైలర్ ను ఫస్ట్ రిలీజ్ చేశాము. దానికి అనుకున్న వ్యూస్ రాలేదు. ఇప్పుడొస్తున్న సినిమాలు అన్నీ బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందిందని చాలామంది అన్నారు.అందువల్ల రెండవ ట్రైలర్ లో ఒక్క లిప్ కిస్ కూడా లేకుండా ఈ ట్రైలర్ ను విడుదల చేశాము.ఈ సినిమాకు దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు ఇన్వెస్ట్ చేసి తీసిన క్రవుడ్ ఫండెడ్ మూవీ.
నా మీద, నా స్టోరీ మీద ఇంత నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.ఇది ఓన్లీ యూత్ తో పాటు పేరెంట్స్ కూడా చూడదగ్గ సినిమా.మీరందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ఈ నెల 29న విడుదల అవుతున్నా మా సినిమాను మీరందరూ తప్పక చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ …సినిమా మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు అశోక్ గారు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది మాకు మాత్రమే తెలుసు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు క్యాస్టింగ్ వేరే అనుకున్నాము.తరువాత మేము చాలా స్ట్రగుల్ పేస్ చేశాము.అయితే కొత్త వాళ్ళు ఎందుకు అని షూటింగ్ డేస్ పెరిగినా ఇబ్బంది ఉండదని మేము తీసిన షార్ట్ ఫిలిం హీరో హీరోయిన్లు తో అయితే కంఫర్ట్ ఉంటుందని ఫైనల్ గా వారితోనే ఈ మూవీ చేయడం జరిగింది.
ఇందులో రొమాన్స్ ఉన్నా స్టోరీ డిమాండ్ తగ్గట్టే ఉంటుంది.మా సినిమాను అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకొంటున్నాను.
హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ..అందరూ అందరూ ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు చాలా కష్టపడి పనిచేశాం. మేము చేసిన డెమో షార్ట్ ఫిలిం కి సైమా అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. మాపై నమ్మకంతో ఎంతోమంది ఇన్వెస్ట్ చేసిన వారి మనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదని ఈ మూవీ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి రూపాయి మేము జస్టిఫై చేశామని అను కుంటున్నాము.
రొమాన్స్ కోసం తీసిన సినిమా కాదిది కథ డిమాండ్ చేస్తే చేసిన సినిమా. మేము విడుదల చేసిన ఫస్ట్ ట్రైలర్ కు, సెకండ్ ట్రైలర్ కు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్సే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా రోజుల నుండి మేము ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం.ఈ నెల 29 న విడుదల అవుతున్న మా సినిమాను మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.
హీరో సన్నీ మాట్లాడుతూ …ఒక చిన్న సినిమా వస్తుందంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మధుర శ్రీధర్ గారు ఒకరు.నేను చేస్తున్న మొదటి సినిమాకు మధుర శ్రీధర్ గారు వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది..
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ..అశోక్ కష్టాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను, సినిమా కోసం ఇంత కష్ట పడతారా అనుకున్నా.. అతని బ్లడ్ లో కూడా సినిమా కనబడేలా కష్టపడతాడు అశోక్ కు చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు.