హాట్ టాపిక్: టీడీపీ ఫ్లెక్సీపై జూనియర్ ఎన్టీఆర్ ఫొటో

పార్టీ సర్వనాశనం అయినా ఫర్వాలేదు, ఎన్టీఆర్ ను మాత్రం స్వాగతించేది లేదన్నట్టున్నారు చంద్రబాబు-లోకేష్. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం ఎప్పటికప్పుడు తమ మనసులో కోరికను వివిధ రూపాల్లో బయటపెడుతూనే ఉన్నారు.  Advertisement పార్టీ మళ్లీ…

పార్టీ సర్వనాశనం అయినా ఫర్వాలేదు, ఎన్టీఆర్ ను మాత్రం స్వాగతించేది లేదన్నట్టున్నారు చంద్రబాబు-లోకేష్. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం ఎప్పటికప్పుడు తమ మనసులో కోరికను వివిధ రూపాల్లో బయటపెడుతూనే ఉన్నారు. 

పార్టీ మళ్లీ పునరుత్తేజం కావాలంటే లోకేష్ ఇంట్లో కూర్చోవాలని, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వాళ్లు బలంగా కోరుకుంటున్నారు. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా రాడా అనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ చర్చ ఇప్పుడు మరోసారి మొదలైంది. దీనికి కారణం ప్రకాశం జిల్లాలో వెలిసిన ఓ ఫ్లెక్సీ. 

నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ జిల్లాలోని యెర్రగొండపాలెంలో టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీ పెట్టారు. అందులో జిల్లా టీడీపీ నేతలతో పాటు ఎన్టీఆర్ కు స్థానం కల్పించారు. అక్కడితో ఆగకుండా తారక్ కు నెక్ట్స్ సీఏం అనే క్యాప్షన్ కూడా తగిలించారు.

కచ్చితంగా చంద్రబాబుకు, లోకేష్ కు ఆగ్రహం కలిగించే చర్య ఇది. అయితే దీనిపై అంతా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ఆ ఫ్లెక్సీకి, తమ టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని.. టీడీపీ ఇంచార్జ్ చెబుతున్నారు. 

ఫ్లెక్సీ కోసం ఎవ్వరూ తమ అనుమతి తీసుకోలేదని, అది కచ్చితంగా ఎన్టీఆర్ అభిమానుల పని అని చెబుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ మాత్రం, ఇది తమ వాళ్ల పనే అంటూ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.

నిజానికి అది టీడీపీ కార్యకర్తలు, స్థానిక నేతల పని అని తెలిసినా చంద్రబాబు ఉన్నఫలంగా చేసేదేం లేదు. వాళ్లపైన కన్నెర్రజేసేంత సీన్ బాబుకు లేదు. క్రమశిక్షణారాహిత్యం కింద ఏమైనా చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే, మొదటికే మోసం వస్తుందని బాబుకు తెలుసు. 

మరీ ముఖ్యంగా ఇది ఎన్టీఆర్ తో వ్యవహారం. కాబట్టి బాబు కూడా ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్టు ఊరుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీలో ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. 

ఎన్నికల ఫలితాల విశ్లేషణలు, తదనంతర సమావేశాల్లో కూడా కొంతమంది ఎన్టీఆర్ పేరును బాహాటంగా ప్రతిపాదించారు. తారక్ ను తెరపైకి తీసుకురావడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదనేది వాళ్ల వాదన. క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు.

కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు, ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారనేది బహిరంగ రహస్యం. తను అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎప్పుడూ ఎన్టీఆర్ ను దగ్గరతీసుకునే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు పార్టీకి పూర్తిగా దూరంచేశారు. ఆ బాధ ఎన్టీఆర్ లో ఉంది. 

ఇదే విషయాన్ని వైసీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు బాహాటంగా చెబుతారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫొటోతో టీడీపీ ఫ్లెక్సీ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అన్నట్టు ప్రస్తుతం ఎన్టీఆర్ మామ, వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ వార్ణింగ్ ఇస్తున్నాడు