ఏరు దాటేసిన హీరో

ఆ హీరో ఫ్లాపుల్లో వున్నాడు. ఆ హీరోకి హిట్ కావాలి. అందుకే చేస్తున్న లేటెస్ట్ సినిమా బడ్ఙెట్ పెంచేసాడు.ఎలా? పట్టుపట్టి తనకు ఫలానా హీరోయిన్ నే కావాలని నిర్మాతను ఒప్పించాడు. పట్టుపట్టి తనకు ఫలానా…

ఆ హీరో ఫ్లాపుల్లో వున్నాడు. ఆ హీరోకి హిట్ కావాలి. అందుకే చేస్తున్న లేటెస్ట్ సినిమా బడ్ఙెట్ పెంచేసాడు.ఎలా? పట్టుపట్టి తనకు ఫలానా హీరోయిన్ నే కావాలని నిర్మాతను ఒప్పించాడు. పట్టుపట్టి తనకు ఫలానా స్టార్ కాస్ట్ కావాలని ఓకె చేయించాడు. 

అక్కడితో ఆగలేదు. తనకు ఫలానా మ్యూజిక్ డైరక్టర్ కావాలని మారాం చేసాడు. నిర్మాత సరే అన్నాడు. ఇరవై పాతిక కోట్లలో కావాల్సిన సినిమా ముపై కోట్లు దాటేసింది. సరే, అదృష్టం బాగుంది. మంచి బజ్ వచ్చింది. 

విడుదలకు ముందే అన్ని విధాలా మంచి రేట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే విషయం వార్తలు వస్తుంటే హీరో తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దీనికి సోలో క్రెడిట్ అతనికి రావడం లేదు. హీరొయిన్ కు పోతోంది. 

ఆ హీరోయిన్ లక్కీ లెగ్..ఆ హీరోయిన్ వల్లే ఈ రేట్లు..ఆ కాంబినేషన్ వల్లే ఈ క్రేజ్ అంటూ వార్తలు వస్తుంటే ఆ హీరో భరించలేకపోతున్నాడని బోగట్టా. కక్కలేక.మింగలేక..కిందా మీదా అయిపోతున్నాడు. రేపు సినిమా నిజంగా హిట్ అయితే ఇంక ఎలా ఫీలవుతాడో?