బాబుపై జ‌గ‌న్ ఘాటు విమ‌ర్శ‌లు …ఆమె హ‌ర్ట్‌

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ముఖ్య‌మంత్రి వైఎస్ ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ అధికార ప్ర‌తినిధి దివ్య‌వాణి జీర్ణించుకోలేకున్నారు. ఆమె ఆవేద‌న చూస్తే చాలా హ‌ర్ట్ అయిన‌ట్టు క‌నిపిస్తున్నారు.  Advertisement వెండితెర నుంచి రాజ‌కీయ తెర…

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ముఖ్య‌మంత్రి వైఎస్ ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ అధికార ప్ర‌తినిధి దివ్య‌వాణి జీర్ణించుకోలేకున్నారు. ఆమె ఆవేద‌న చూస్తే చాలా హ‌ర్ట్ అయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. 

వెండితెర నుంచి రాజ‌కీయ తెర మీద‌కు మ‌కాం మార్చిన దివ్య‌వాణి ….సినిమా డైలాగ్‌లు వ‌ల్లె వేస్తూ మీడియా అటెన్ష‌న్‌ను త‌న వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌ధ్య డైలాగ్ వార్ సాగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాట‌ల దాడిని టీడీపీ అధికార ప్ర‌తినిధి దివ్య‌వాణి తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. తండ్రి వ‌య‌సున్న ప్ర‌తిప‌క్ష నేత‌ను ప‌ట్టుకుని పై కంపార్ట్‌మెంట్లో బుర్ర ఉందా అంటున్న ముఖ్య‌మంత్రికి మ‌ధ్య కంపార్ట్‌మెంట్లో మ‌న‌సు ఉందా? అని ఆమె సినీ ఫ‌క్కీలో ప్ర‌శ్నించారు.

అసెంబ్లీని దేవాలయమంటూనే, తండ్రి వయసున్న ప్రతిపక్షనేతను ముఖ్యమంత్రి అనరాని మాటలనడాన్ని ప్రజలు హ‌ర్షించ‌డం లేద‌న్నారు. తండ్రి లాంటి ప్ర‌తిప‌క్ష నేత‌ను జ‌గ‌న్ తిట్ట‌డం త‌ప్పైతే, కొడుకులాంటి ముఖ్య‌మంత్రిని ప్ర‌తిప‌క్ష నేత ఫేక్ సీఎం, సైకో అని స్థాయి మ‌రిచి నోరు పారేసుకోవ‌డం దివ్య‌వాణి దృష్టిలో ఎలా స‌బ‌బో స‌మాధానం చెప్పాల్సి ఉంది. 

గౌర‌వ మ‌ర్యాద‌ల‌నేవి ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకోవ‌డంపై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని దివ్య‌వాణికి తెలియ‌క‌పోవ‌డం ఆమె అమాయ‌క‌త్వ‌మా?  లేక అజ్ఞాన‌మా? ఇదిలా ఉండ‌గా మంత్రి కొడాలి నానిపై మ‌రోసారి ఆమె నోరు పారేసుకున్నారు. అయితే తాను తెలివిగా విమ‌ర్శిస్తున్న‌ట్టు ఆమె అనుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

మంత్రి కొడాలి నాని త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబును అరేయ్ అంటే, ఆయన్ని ఒరేయ్ అని తిరిగి అనడం నిమిషం పనే అంటూ దివ్య‌వాణి ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు నాయుడిని ప‌దేప‌దే వెన్నుపోటుదారుడ‌ని విమ‌ర్శించే ముందు, నాని ఒక్కసారి ఇంగితజ్ఞానంతో ఆలోచిస్తే మంచిదని దివ్యవాణి హితవు పలికారు. దివ్య‌వాణికి కొడాలి నాని ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

పచ్చ మీడియాకు ఎలాగూ పట్టదు