వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 258 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌటైంది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరకు ఒక్క పరుగు ఇంగ్లండ్ కు ఓటమి పలకరించగా అదే సమయంలో విజయంతో కివిస్ రెండు టెస్టు మ్యాచ్ ల సిరిస్ ను 1-1తో డ్రా చేసుకొని పరువు నిలుపుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో మెరిసిన జో రూట్ రెండ్ ఇన్నింగ్స్ లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న రూట్ 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రూట్ ఉన్నంతవరకు ఇంగ్లండ్ విజయం దిశగానే నడిచింది. అయితే మధ్యలో కివీస్ బౌలర్లు ఫుంజుకొని వికెట్లు తీయడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది.
అయితే చివర్లో బెన్ స్టోక్స్(33), బెన్ ఫోక్స్ లు(35) పరుగులు రాణించడంతో ఇంగ్లండ్ మరోసారి గెలుపు ట్రాక్ ఎక్కింది. ఈ దశలో కివీస్ బౌలర్టు సౌథీ, వాగ్నర్ లు స్వల్ప వ్యవధి తేడాతో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అండర్స్ వాగ్నర్ బౌలింగ్ లో టామ్ బ్లండెల్ కు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీయగా.. సౌథీ మూడు, మాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రూట్, హ్యారీ బ్రూక్ లు సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 209 పరుగులకు అలౌటైంది. దీంతో కివీస్ ను ఇంగ్లడ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ సెంచరీతో మెరవడంతో 483 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ ఉంచగలిగింది.