పురిటి నొప్పులతో సైకిల్ తొక్కుకుంటూ హాస్పిటల్ కు..!

డెలివరీ పెయిన్స్ వస్తే ఎవరైనా వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు. లేదంటే అందుబాటులో ఉన్న వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్తారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం తనకు పురిటి నొప్పులు రాగానే సైకిల్…

డెలివరీ పెయిన్స్ వస్తే ఎవరైనా వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు. లేదంటే అందుబాటులో ఉన్న వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్తారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం తనకు పురిటి నొప్పులు రాగానే సైకిల్ బయటకు తీసింది. ఎంచక్కా తొక్కుకుంటూ హాస్పిటల్ వరకు వెళ్లింది. ఆమె సాధారణ మహిళ కూడా కాదు. ఏకంగా న్యూజిలాండ్ ఎంపీ.

జూలీ అనె జెంటర్.. న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యురాలు. డాక్టర్ చెప్పిన టైమ్ కు చెప్పినట్టుగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. జూలీ కంగారు పడలేదు. భర్త సహకారంతో సైకిల్ తీసింది. 10 నిమిషాలు సైకిల్ తొక్కుతూ హాస్పిటల్ కు చేరుకుంది. సరిగ్గా అప్పటికి ఆమెకు పెయిన్స్ ఎక్కువయ్యాయి.

ఆ వెంటనే జూలీని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మొత్తాన్ని స్వయంగా జూలీ బయటపెట్టింది. సైకిల్ తొక్కాలని తను ప్లాన్ చేయలేదని, నొప్పులు పెద్దగా లేకపోవడంతో సైకిల్ పై వెళ్లినట్టు తెలిపింది.

నిజానికి ఈ పార్లమెంట్ సభ్యురాలు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో కూడా తొలిసారి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు సైకిల్ పైనే హాస్పిటల్ కు వెళ్లింది జూలీ. సైక్లింగ్ చేయడం వల్ల డెలివరీ సజావుగా సాగిందని ఆమె చెప్పుకొచ్చింది.