తమన్, కీరవాణికి మీనా స్పెషల్ రిక్వెస్ట్

సీనియర్ నటి మీనా స్పెషల్ రిక్వెస్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. తమన్, కీరవాణి కి ప్రత్యేకంగా ఓ విషయాన్ని విజ్ఞప్తి చేస్తోంది. ఇకపై సింగర్స్ జాబితాలో తనను కూడా చేర్చాలంటోంది. పాడే అవకాశం ఇస్తే…

సీనియర్ నటి మీనా స్పెషల్ రిక్వెస్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. తమన్, కీరవాణి కి ప్రత్యేకంగా ఓ విషయాన్ని విజ్ఞప్తి చేస్తోంది. ఇకపై సింగర్స్ జాబితాలో తనను కూడా చేర్చాలంటోంది. పాడే అవకాశం ఇస్తే కచ్చితంగా తన టాలెంట్ చూపిస్తానంటోంది ఈ సీనియర్.

“పాటలంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు సరదాగా పాడుతుంటాను. అంతే తప్ప, నేను నేర్చుకోలేదు. నేను ప్రొఫెషనల్ సింగర్ ను కాదు. డాన్స్ నేర్చుకున్నాను కానీ సింగింగ్ మాత్రం ఎప్పుడూ నేర్చుకోలేదు. కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంది. ఓ పాట పాడాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. చూద్దాం, కీరవాణి, తమన్ నాకు ఓ అవకాశం ఇస్తారేమో చూడాలి.”

ఇలా పాటలు పాడాలనే తన ఆసక్తిని బయటపెట్టింది మీనా. రీసెంట్ గా స్ట్రీమింగ్ కొచ్చిన దృశ్యం-2 సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న మీనా.. దయచేసి రొటీన్ పాత్రలు ఆఫర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తోంది. కొత్త క్యారెక్టర్స్ చేసే టాలెంట్ తనలో ఉందని, అది గుర్తించాలని కోరుతోంది.

“పాత హీరోయిన్ అంటే చాలు వదిన, అక్క, అమ్మ పాత్రలిస్తున్నారు. అలాంటి పాత్రలు పోషించాలని లేదు. నేను ఇంకా మంచి పాత్రలు పోషించగలను. నా కోసమైనా రచయితలు కొత్త పాత్రలు రాస్తారని ఆశిస్తున్నాను. నాకైతే కాస్త ఆసక్తికరంగా, కొత్తగా ఉండే పాత్రలు చేయాలని ఉంది.”

గతంలో నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మరింత బాగా నటించడానికి అవకాశం ఏర్పడిందని చెప్పుకొచ్చింది మీనా. ఇండస్ట్రీలోని అన్ని రంగాల్లో మార్పు అనివార్యమని, ఆ మార్పులను అలవాటు చేసుకుంటే కెరీర్ సాఫీగా సాగిపోతుందని చెబుతోంది.