మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లుఅర్జున్… వీళ్లంతా అగ్రశ్రేణి హీరోలు. వీరి చిత్రాలు తొంభై నుంచి వంద లేదా నూట పాతిక కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. వీరు ఏడాదికో సినిమా చేస్తుంటారు. కానీ పరిశ్రమని నడిపించేది వీరి తర్వాతి రేంజ్లో వుండే హీరోలు. నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ తదితరులు ఈ గ్రూప్‌లో వుంటారు.
ఈ గ్రూప్‌ని ఒక టైమ్‌లో నాని రూల్ చేసాడు. తర్వాత విజయ్ దేవరకొండ దూసుకొచ్చాడు. వరుణ్ తేజ్ కూడా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఇదే గ్రూప్‌లో కాస్త స్తబ్ధుగా వుండిపోయిన రామ్ 'ఇస్మార్ట్ శంకర్'తో తన రేంజ్ ఏమిటో చూపించాడు. అంతకుముందు నాగచైతన్య కూడా 'మజిలీ'తో తన స్థాయి పెంచుకున్నాడు. దీంతో మిడిల్ ఆర్డర్లో టెన్షన్ స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఈ జోన్లో ఏ హీరో సేఫ్ కాదు. ఎవరూ ఒక్క ఫ్లాప్ కూడా అఫార్డ్ చేయలేరు. అయితే ఇంతమంది హీరోలు అయిపోవడంతో కథల పరంగా షార్టేజీ వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హీరోకి కూడా తదుపరి చిత్రం ఫలితంపై విపరీతమైన గుబులు పుడుతోంది. అగ్రశ్రేణి దర్శకులు కేవలం ఆ ఐదుగురు టాప్ హీరోలకే పరిమితం అయిపోకుండా అడపాదడపా ఇటు కూడా ఒక లుక్కేస్తూ వుంటే వీళ్ల మార్కెట్ కూడా కుదురుకుంటుంది.